బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Jul 23, 2020 , 00:16:38

‘కోటి గొంతుకల రుద్రవీణ దాశరథి’

‘కోటి గొంతుకల రుద్రవీణ దాశరథి’

  వనపర్తి టౌన్‌: తెలంగాణ కోటి గొంతుకుల రుద్రవీణ దాశరథి రంగచార్యులని ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడాప్రాంగణంలో దాశరథి కృష్ణమాచార్యులు 95వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని జాగృత పరిచి ఉద్యమ చైతన్యం కలిగించిన మహాకవి దాశరథి అని, నిజాం నిరంకుశ గుండెల్లో గళమెత్తి తిరుగుబాటు చేశాడన్నారు. పదునైన మాటలు, పాటలతో ప్రజలను చైతన్యం చేస్తు అనేక కవితా సంపుటాలను విల్లువరించారన్నారు. సినీ గేయ రచయితగా ఎన్నో పాటలు రచించి సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. కార్యక్రమంలో కవి పండితులు గిరిరాజయ్య, వ్యాఖ్యాత నాయకంటి నరసింహశర్మ, కళాకారుడు డప్పు నాగరాజు, ఈశ్వర్‌, నాగన్న, మహేశ్‌యాదవ్‌ తదితరులు ఉన్నారు.