గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 26, 2020 , 01:03:45

కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమే..

కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమే..

  • కోలాహలంగా నామినేషన్‌ దాఖలు చేసిన నేతలు

తాండూరు టౌన్‌ : మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక గులాబీ పక్షమే అని తాండూరు టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో కోఆప్షన్‌ సభ్యుల దరఖాస్తు ప్రక్రియ కోలాహలంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ రఫూ, నాయకులు రాజుగౌడ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ మాజీ కౌన్సిలర్లు బిడ్కర్‌ ఉష, వెంకట్రాములు నాయక్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నాయకుడు విజయ్‌కుమార్‌ సతీమణి సారంగ కోఆప్షన్‌ సభ్యుల స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసి పత్రాలను కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. తాండూరు మున్సిపల్‌లో కోఆప్షన్‌ సభ్యుల నామినేషన్‌కు మొత్తం 10 దరఖాస్తులు అందాయి. కోఆప్షన్‌ సభ్యుల స్థానానికి ఈ నెల 18న నామినేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. జీవో నంబర్‌ 57 కింద ఒక మహిళకు, జనరల్‌తో పాటు జీవో నంబర్‌ 58 కింద మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు, ఒక జనరల్‌కు మొత్తం నాలుగు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు దరఖాస్తులు ఆహ్వానించగా శుక్రవారం నాటికి 5 దరఖాస్తులు అందాయి. చివరి రోజు శనివారం సాయంత్రం 5 గంటల నిర్ణీత గడువులో మరో 5 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దీంతో నాలుగు కోఆప్షన్‌ మెంబర్లకు మొత్తం 10 దరఖాస్తులు అందాయని తెలిపారు.


logo