శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jul 18, 2020 , 00:02:20

శాకాంబరీ నమోస్తుతే..

 శాకాంబరీ నమోస్తుతే..

  • దేవాలయాల్లో  నిరాడంబరంగా ఉత్సవాలు

తాండూరు టౌన్‌ : శాకాంబరీ నమోస్తుతే అంటూ భక్తులు ఆలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆషాఢమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మర్రిచెట్టు కూడలి వద్ద వెలసిన రక్తమైసమ్మ, గుమాస్తానగర్‌లోని కట్టమైసమ్మ దేవాలయాల్లో శాకాంబరీ ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. ఆయా ఆలయాల్లో అమ్మవార్లు శాకాంబరీ మాతలుగా దర్శనమిచ్చారు. ఆదర్శనగర్‌లోని కట్టమైసమ్మ, ఇందిరానగర్‌లోని రేణుకా నాగఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదర్శనగర్‌లోని కట్ట మైసమ్మకు కౌన్సిలర్‌ నీరజాబాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు బాల్‌రెడ్డి పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తులు ఆలయాలకు చేరుకుని భౌతిక దూరం పాటి స్తూ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిరాడంబరంగా బోనాల పండుగ 

 పరిగి టౌన్‌: పరిగి మండల పరిధిలోని సయ్యద్‌ మల్కాపూ ర్‌, ఖుదావంద్‌పూర్‌ గ్రామాల్లో శుక్రవారం మైసమ్మ, పోచ మ్మ బోనాలను ఆయా గ్రామాల ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటాల కు పోకుండా భౌతిక దూరం పాటిస్తూ బోనాల పండుగను జరుపుకున్నారు. గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పిం చి మొక్కులు తీర్చుకున్నారు. ఖుదావంద్‌పూర్‌ గ్రామంలో సర్పంచ్‌ గోపాల్‌, ఎంపీటీసీ ఉమాదేవి గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించారు.సయ్యద్‌మల్కాపూర్‌లో జరిగిన బో నాల వేడుకల్లో పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

పోచమ్మ బోనాలు

 కులకచర్ల: కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం పోచమ్మతల్లికి బోనాలు నిర్వహించారు. కరోనా ని నేపథ్యంలో ఇండ్లల్లోనే బోనాలు చేసుకొని ఒక్కొక్కరుగా దేవాలయానికి వచ్చి భౌతిక దూరం పాటిస్తూ అ మ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


logo