ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 02, 2020 , 23:09:30

జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా వేడుకలు

జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా వేడుకలు

  • వికారాబాద్‌ కలెక్టరేట్లలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి సబిత, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌
  • వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం
  • పాలమూరు-రంగారెడ్డి త్వరలోనే పూర్తవుతుంది
  • రాష్ట్ర అవతరణ దినోత్సవంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి  
  • పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు 

రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా ప్రభావం.. లాక్‌డౌన్‌తో నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, పోలీస్‌స్టేషన్లలో జాతీయ జెండాను ఎగురవేశారు. మంత్రి  సబితారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ వేడుకల్లో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రాణాన్ని పణంగా పెట్టి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అన్నారు.  అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. 

- వికారాబాద్‌


logo