న్యూఢిల్లీ: భోజనం చేశాక పాన్ వేసుకుంటే ఆ మజాయే వేరు.. ఇక ‘ప్యూర్ గోల్డ్’ పాన్ వేసుకోవడం అంటే వేరే చెప్పాలా.. అవును ఇది నిజం.. దేశ రాజధాని ఢిల్లీ నగర పరిధిలోని ఓ పాన్ షాప్‌లో ఈ ‘ప్యూర్ గోల్డ్’ పాన్ లభ్యం అవుతోంది. దీని ధర రూ.600 మాత్రమే..
కన్నౌట్ప్లేస్లోని యము పంచాయత్ పాన్ షాప్‌లో స్పెషల్ వెరైటీ ‘ప్యూర్ గోల్డ్’ పాన్ లభిస్తుండటంతో అందరి ద్రుష్టి అక్కడికే మళ్లుతున్నది. ఈ ‘ప్యూర్ గోల్డ్’ పాన్ తయారీపై ఒక మహిళ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలైంది.
‘రాఫెలో గోల్డ్ పాన్’ తయారు చేయడంలో ఉపయోగించే సామగ్రి, దానిని తయారు చేయడం ఎలాగో ఒకసారి పరిశీలిద్దాం..
సదరు మహిళ తమలపాకుకు చునా (కాల్షియం హైడ్రాక్సైడ్) పూసి పాన్ తయారీ ప్రారంభిస్తారు.. అటుపై చట్నీ, వాసన కోసం అరోమా (కుష్బూ) కలిపి ఆకుపై పూశారు. ఈ పాన్ తయారీలో వాడే సామగ్రితో టేస్ట్‌గా ఉండటంతోపాటు గొంతును తడి చేస్తుందంటారావిడ.
వక్కల పొడి, కొబ్బరి తురుము, సోంపు గింజలతోపాటు హానీతో తయారయ్యే గుల్కాండ్ ఆకుపై వేస్తారు. అటుపై రాఫెల్లో (చాక్లెట్) జత చేస్తారు. తర్వాత తమలపాకును మడిచి ప్యూర్ గోల్డ్ వర్క్‌తో చుడతారు.
అటుపై చెర్రీ, రాఫెల్లో (చాక్లెట్)తో గార్నెష్ చేస్తారు.. ఈ పాన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా ఆమె చెబుతున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో