శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Feb 14, 2020 , 00:02:59

రేపే పోలింగ్‌

రేపే పోలింగ్‌
  • ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌
  • ఎన్నికల నిర్వహణకు 552 మంది అధికారులు నియామకం
  • పోలింగ్‌ కేంద్రాలకు చేరనున్న ఎన్నికల సామగ్రి
  • జిల్లాలోని 184 ప్రాదేశిక నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలు
  • సహకార ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగనుంది, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. తదనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో సొసైటీ ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో ఎన్నికలు జరుగనున్న అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సరిపడా బ్యాలెట్‌ బాక్సులతో పాటు ఎన్నికల సిబ్బందిని కూడా ఇప్పటికే సమకూర్చడం జరిగింది. నేడు సాయంత్రం లోగా ఎన్నికల సామగ్రితో ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడిం గ్‌ అధికారులు, ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరిగేందుకుజిల్లా పోలీస్‌ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రేపు సొసైటీ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు. మరోవైపు జిల్లాలో కుల్కచర్ల, హస్నాబాద్‌, ఎక్‌మామిడి సహకార సంఘాల్లోని అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నిక ఏకగ్రీవమైన దృష్ట్యా 19సహకార సంఘాల్లోని 184ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలోని ఆయా సొసైటీల్లోని 45,973మంది ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి...

సహకార ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. బ్యాలెట్‌ పత్రాలను ముద్రించడంతో పాటు ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 19 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 184వార్డులకు ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ బూతును ఏర్పాటు చేశారు. అదే విధంగా పోలింగ్‌ బూతుకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి, ఒక ఇతర ప్రిసైడింగ్‌ అధికారిని నియమించారు. 184వార్డులకు 552మంది పీవో, ఏపీవో, వోపీవోలను ఎన్నికల నిర్వహణకు నియమించారు. అదే విధంగా నేడు సాయంత్రం వరకు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులతో పాటు ఇతర ఎన్నికల సామగ్రిని చేరవేయనున్నారు. ఎన్నికలు జరుగనున్న అన్ని వార్డులకు వికారాబాద్‌లోని మేరి నాట్స్‌ స్కూల్‌ నుంచి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. 

184 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు...

జిల్లాలోని 19ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 184ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలోని కుల్కచర్ల, హస్నాబాద్‌, ఎక్‌మామిడి సొసైటీలోని 13 ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. వీటితోపాటు మిగతా సొసైటీల్లోని 102వార్డుల్లో కూడా ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. 19 సొసైటీల్లోని 184వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరుగనున్న ఆయా వార్డులకు సంబంధించి వివరాలు శివారెడ్డిపేట సొసైటీలోని 11, కొత్తగడిలో 2, వట్టిమీనపల్లిలో 11, ధారూర్‌లో 10, హరిదాసుపల్లిలో 1, పూడూరులో 12, మోమిన్‌పేట్‌లో 8, మేకవనంపల్లిలో 11, పెద్ద మర్పల్లిలో 13, బంట్వారంలో 11, తట్టేపల్లిలో 13, పెద్దేముల్‌లో 4, ఎల్మకన్నెలో 10, యాలాలలో 12, నవాంగిలో 12, దౌల్తాబాద్‌లో 11, మెట్లకుంటలో 12, మోత్కూర్‌లో 12, పరిగిలో 8 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలోని 22 సొసైటీల్లోని 286ప్రాదేశిక నియోజకవర్గాలకుగాను 102 ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. కొత్తగడి 11, హరిదాసుపల్లి 12, పెద్దేముల్‌ 9, శివారెడ్డిపేట్‌లో 2, ధారూర్‌లో 3, పూడూర్‌లో 1, వట్టిమీనపల్లిలో 2, పరిగిలో 5, మోమిన్‌పేట్‌లో 5, మేకవనంపల్లిలో 2, బంట్వారంలో 2, మోత్కూరులో 1, మెట్లకుంటలో 1, ఎల్మకన్నెలో 3, యాలాలలో 1, నవాంగిలో 1, దౌల్తాబాద్‌ సొసైటీలో రెండు ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైనా సొసైటీల్లో సుమారు 90ప్రాదేశిక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఓటు హక్కు వినియోగించుకోనున్న 45,973మంది ఓటర్లు...

జిల్లాలో ఎన్నికలు జరుగనున్న 19సొసైటీల్లోని 184వార్డు ల ఎన్నికల్లో 45,973 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరుగనున్న ఆయా సొసైటీల్లోని ఓటర్లకు సంబంధించిన వివరాలు.. శివారెడ్డిపేట సొసైటీలో 3168, కొత్తగడిలో 126, వట్టిమీనపల్లిలో 3092, ధారూర్‌లో 3370, హరిదాసుపల్లిలో 28, పూడూరులో 4191, మోమిన్‌పేట్‌లో 2064, మేకవనంపల్లిలో 1140, పెద్ద మర్పల్లిలో 4691, బంట్వారంలో 2934, తట్టేపల్లిలో 1922, పెద్దేముల్‌లో 599, ఎల్మకన్నెలో 1650, యాలాలలో 2796, నవాంగిలో 3202, దౌల్తాబాద్‌లో 2645, మెట్లకుంటలో 2420, మోత్కూర్‌లో 3936, పరిగిలో 1999 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తాజావార్తలు


logo