రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన సంకోజీ రమేశ్- లావణ్య దంపతుల కొడుకు శివ(2నెలలు) గుండె సంబంధిత వ్యాధితో జన్మించాడు. బాలుడికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఇందుకోసం రూ.8లక్షల-రూ.10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. రమేశ్‌ది నిరుపేద కుటుంబం. దీంతో రమేశ్ దీనగాథను ఆయన స్నేహితులు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. సోషల్‌మీడియాలో పోస్ట్‌కు హీరో సంపూర్ణేశ్‌బాబు స్పందించారు. వెంటనే రామన్నపేటకు వచ్చి శివ తల్లిదండ్రులకు రూ.25వేల చెక్కును అందజేశారు. శస్త్రచికిత్సకు సాయం చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా కూడా ఇచ్చారు. దాతలు ముందుకువచ్చి చిన్నారి ప్రాణం కాపాడాలని పిలుపునిచ్చారు.