– కావేరి కృష్ణ, అనంతారం
చాలామంది ఇంటికి పెరిగిన నైరుతి స్థలాన్ని తిరిగి వాళ్లే వాడుతుంటారు. అది దోషం. దానిని ఇంటి స్టాఫ్‌కు ధారాదత్తం చేయాలి. అంటే మన పేరు మీద లేకుండా చేయాలి. దానిమీద మన హక్కులు వదులుకోవాలి. ఇల్లు దక్షిణ-నైరుతివైపు పెరిగితే, పక్కన ఉన్న ఇంటి వారికి వాయవ్యం తగ్గుతుంది కాబట్టి వారికి ఇచ్చేయాలి. అది పక్కవారికి ఎంతో మంచిది. దానంగా ఇచ్చినా కూడా మంచిదే.
పనిచేసే ఇంటి స్టాఫ్‌కి అందులో గదులు కట్టించి దానిలోకి వెళ్లడానికి బయటినుంచి గేటు ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఆ స్థలాన్ని కూడా మన పేరుమీద లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. దక్షిణ-పశ్చిమ నైరుతులు కలిపి ఇంటి ప్రహరీ ఎత్తుచేసి కట్టుకోవాలి. పడమర వైపు రోడ్డు వచ్చినప్పుడు పెరిగిన నైరుతి స్థలాన్ని వదిలి దానికి పడమర గుండా వెళ్లే షాపును కట్టుకోవచ్చు. లేదా గదులు వేసి సపరేటు చేసి అద్దెకి ఇవ్వండి. పెరిగిన స్థలం వాడుకలోకి వచ్చినప్పుడు అది ఎంతో బలం ఇస్తుంది.
– కళ్లెం రాములు, పోచంపల్లి
ఇంటికి మీరు తూర్పువైపు వరండా వేసి ఉంటే ఆగ్నేయంలో గది కట్టాలి. ఏ దిశకు వరండా వేసినా గదికి ప్రాధాన్యత ఉంటుంది. వాయవ్యంలో గది కట్టి.. దానికి తూర్పు-ఈశాన్యంలో ద్వారం పెట్టాలి. దక్షిణం, పడమరలో వరండా ఉంటే దక్షిణ నైరుతిలో గది వేసి ఆ గదికి తూర్పు ఈశాన్యంలో ద్వారం ఇవ్వాలి.

పడమర వైపు వరండాలో కూడా నైరుతిలో గది కట్టి, దానికి ఉత్తర-ఈశాన్యంలో తలుపు ఇవ్వాలి. ఈ విధంగా కట్టిన గదులలో ధాన్యం నిలువ చేసుకోవచ్చు. మిగతా సమయంలో ఇతరత్రా స్టోర్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ వసారాలు పడమర -దక్షిణంలో ఉంటే తూర్పు-ఉత్తరాలలో కూడా వేయాలి. ఇంటి ఫ్లోరింగ్ కంటే కిందికి నిర్మాణం చేయాలి.
– వి. మార్కండేయ
కొన్ని ఊర్లలో చేదబావులు ఉంటాయి. ఒకనాడు ఆ బావులు మనందరి దాహాన్ని తీర్చాయి. మీరు చెబుతున్న బావి ఇప్పటికీ వాడుతున్నారా? లేక పాడుపడి ఉందా? అనేది స్పష్టత ఇవ్వలేదు. సహజంగా బావులు గ్రామం చౌరస్తాలో అన్ని వీధులూ కలిసే చోట ఉంటాయి. కానీ, నేడు అవి కనుమరుగైపోయాయి. ఎన్నో వసతులు వచ్చాక వాటి అవసరం లేదు కదా! పల్లెల్లో బావులు, కోనేరులు ఉన్నప్పుడు వాటికి చుట్టూ వీధులు ఉంటే దోషం ఉండదు.

కొన్నిసార్లు మన ఇంటికి ఆనుకొని దక్షిణంలో, పడరమలో బావి ఉంటే మన ఇంటికి కాంపౌండ్ లేకపోయినట్లయితే ప్రభావం ఉంటుంది. దానికి వేరుగా, ఇంటికి దూరంగా ఉంటే మాత్రం దోషం ఉండదు. ఆ బావి వాడకుండా పాడుబడింది అయితే.. దానిని మూసి వేయడం తప్పు కాదు. నీళ్లు వాడే బావిని పూడ్చకూడదు. ఇంటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– రామ్‌రెడ్డి, కొండగడప
వాయవ్యం వాదులాటకు మూలమవుతుంది. సహజంగా అన్నదమ్ములు సర్దుకుపోయినట్లు కోడళ్లు (మీ భార్యలు)కూడా సర్దుకుపోతే సమస్యలే ఉండవు. భూమిలో దోషం చాలా తక్కువ ఉంటుంది. నిర్మాణంలో మీరు దోషం చేసి ఉంటారు. వాయవ్యంలో సెప్టిక్‌ట్యాంకు వేయడం, వాయవ్యంలో త్రెంపు చేయడం మొదలైన దోషాలు ఉంటే సరిచేసుకోండి.

సమస్యలు భూమి విషయంలోనే కాక ఇంకా అనేక విషయాల్లో కూడా ఉంటాయి. అంతేకాదు మీకు ఆగ్నేయంలో కూడా ఏమైనా దోషాలెదురైతే వాటిని సరిచేసుకోండి. మన ఇంటితోపాటు మనకు పట్టు విడుపులు కూడా ఉండాలి. వ్యక్తిత్వం బాగలేకపోతే శాస్త్రం సరిగ్గా పనిచేయదు. మందు పనిచేయాలంటే పత్యం కూడా చేయాలి కదా!
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143