– పెద్దిరెడ్డి, మాల్
మీరు ఇంటిని అంటుకొని ఉత్తరం పోర్టికో వేశారు. అలా నిర్మాణం చేయడమే అసలు తప్పు. పైగా దానిమీద ఇంట్లో గదిని కలిపేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయం మంచిది కాదు. ఇంటికి బయట ప్రధాన గృహం మీదినుంచి వెళ్లి.. ఇంటిని ఆనుకొని సపరేటు గదిని ఉత్తరం దిక్కు వేయకూడదు.

అప్పుడు ఇల్లు ‘టీ’ ఆకారంలోకి మారుతుంది. ఉత్తరం పెరిగి ఈశాన్యం, వాయవ్యం స్థలాల్లో ఇల్లు వక్రనిర్మాణం అవుతుంది. పోర్టికో భాగం కిందా, పైనా ఏ చోటా కలుపుకోవద్దు. అది కామన్ప్లేస్ కిందికి వస్తుంది. కాబట్టి, అక్కడ గది నిర్మాణం చేయొద్దు. దానిని గృహంలోనికి కలపకుండా సపరేటుగా చూడాలి. పోర్టికోను ఇంటి పొడవు ఎంత ఉంటే అంత పెంచుకోండి. అప్పుడు అది శుభగృహం అవుతుంది.
– కె. రాజారెడ్డి, చెర్ల
ఆడపిల్లలు సహజంగా సున్నిత మనస్కులు, ప్రకృతి నిర్వహణలో పరిపూర్ణులు. గృహ నిర్వహణలో వారిదే ప్రధాన పాత్ర. గృహిణి కలదే గృహమన్నారు. పైగా ఇండ్లలో ఎక్కువ సమయం గడిపేది కూడా స్త్రీలే. ఇల్లు-ఇంటి పరిసరాలు పిల్లలను, ఆడవారి అంతర్గత నిర్మాణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేదిగా ఉండొద్దు. ఇంటిచుట్టూ ఖాళీ స్థలంలో పచ్చదనం ఆవరించేలా మొక్కలను నాటేందుకు వీలుగా గృహ పరిసరాలు ఉండాలి. పిల్లలు పరిసరాల నుంచి తల్లిదండ్రుల నుంచే ఎక్కువ ప్రభావితమవుతారు. పచ్చదనం, విశాలమైన స్థలం పిల్లల్లో విశ్వాసాన్ని కలిగిస్తాయి. తద్వారా ఇంట్లో శాంతపూరిత వాతావరణం నెలకొంటుంది. కాబట్టి శాస్త్రీయమైన నిర్మాణ కొలతలు, వాతావరణం, గాలి వెలుతురు విస్తరణకు నెలవుగా ఇంటి నిర్మాణం ఉండాలి.
– దొండ శ్రీశైలం, భువనగిరి
మీ ప్లాన్ చూశాను. నాలుగు దిక్కులకు నాలుగు బెడ్రూంలు కట్టి మధ్యలో స్థలం వదిలారు. అన్నీ వేరువేరుగా ఉండేలా ఓపెన్ టు స్కై డిజైన్ చేశారు. అందాల కోసం మీకు నచ్చినట్లు కడితే అది పూర్ణమైన వాస్తు గృహం కాదు. ఇంటి విషయంలో మీ ఇష్టమున్నట్లు విసిరేసినట్లుగా దూరదూరంగా కట్టడం వల్ల పటిష్టమైన నిర్మాణాన్ని పోలి ఉండదు. భవిష్యత్తులో శుభకార్యాలు చేసుకునే విధంగా గొప్ప నిర్మాణం చేయాలంటే మీ ప్లాన్ పనికిరాదు.
అవి తాత్కాలిక నిర్మాణాలుగానే ఉంటాయి తప్ప పూర్ణ వాస్తు లక్షణాలతో ఉండవు. ఉండటానికి నీడ వేరు. గొప్పగా ఉండే చక్కని మనుష్యాలయం వేరు. కంటైనర్‌లో కూడా ఉండగలమన్న విషయం తెలుసుకదా. అలాగని అవన్నీ వాస్తు గృహాలు కావుకదా. ఫామ్‌హౌజ్ పేరిట ఖండ గృహాలు నిర్మించుకొని ఎక్కువశాతం వాటిల్లోనే గడుపుతున్నారు. మనిషి జీవితం కర్మగతం కావొద్దనేదే శాస్త్ర హృదయం. మీరు సీరియస్‌గా శాస్త్ర గృహం కట్టాలనుకుంటే మీ ప్లాన్ మార్చి కట్టుకోండి. అన్ని విధాలుగా ఆహ్లాదకరంగా జీవిస్తారు.
– దేశి సంపత్ కుమార్, చౌటుప్పల్
పశువుల పాక నిర్మాణం కోసం చాలా స్థలం అవసరమవుతుంది. మీరు వ్యవసాయ ప్రాంతంలో కట్టాలనుకుంటున్నారని అర్థం అవుతున్నది. ఒక స్థలమనేది హద్దులు నిర్ణయించినప్పుడు ఏర్పడుతుంది. మీరు ఎంచుకున్న స్థలంలో నైరుతిలో ఇల్లు ఉన్నట్లయితే, ఆ ఇంటికి పడమరలో గానీ ఆగ్నేయంలో గానీ ఇంటికి దూరంగా పశువుల పాక వేయాలి. వాయవ్యంలో కూడా ఇంటి పడమర పాదును దాటకుండా పాకను వేయవచ్చు.
పాకను రెండు వైపులా వాలుగా వేసుకోవాలి. దానిపైన ఉండే వెన్ను.. ఇంటిని చూడకుండా తూర్పు-పడమరలకు పొడవు ఉండేలా వేసుకోవాలి. ఎక్కడ వేసినా ఇంటికి కనీసం ముప్ఫై ఆడుగుల దూరంలో ఉండటం మంచిది. ఆగ్నేయంలో పశువుల పాక వేసినప్పుడు పాక ఉత్తరం, దక్షిణంలో పొడవుగా ఉండేలా చూసుకోవాలి. పాకకు దగ్గరలో నీటి వసతి ఏర్పాటు చేయాలి కాబట్టి తొట్టిలాగా కట్టాల్సి ఉంటుంది. ఆ నీటి తొట్లు ఎత్తుగా ఉంటాయి. కాబట్టి, దక్షిణం పడమరలో కూడా వేసుకోవచ్చు. ఈశాన్యంలోనే వేయాలనే నియమం అక్కర్లేదు. పశువులకు ఇరుకు లేకుండా, గాలి వెలుతురు వచ్చేలా సరైన పద్ధతిలో విశాలంగా నిర్మించండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143