– బి. కుమార్, బీబీనగర్
చాలా మందికి దక్షిణం- పడమరలు ప్రమాదకరమైన దిశలుగా, అటు తాకకూడదు, ఉండకూడదు అనే భావాలు నాటుకుపోయి ఉన్నాయి. రూపాయిలో రెండు వైపులా ఉండాల్సిన నంబర్లు, చిత్రాలు ఉంటేనే అది డబ్బుగా చెలామణి అవుతుంది. కాళ్లు-తల ఉంటేనే మనిషి అంటాం. ఈ రెండిటిలో తక్కువ, ఎక్కువలు లేనట్లే.. దిశలలో కూడా మంచి చెడులు ఉండవు. దేనిని ఎలా వాడాలి, దేనిని ఎప్పుడు వాడాలి? అనేది ముఖ్యం. అలానే ఏ కార్యం, ఏ విధంగా, ఏ దిశను ఉపయోగించాలి? అనేది ఉంటుంది. దక్షిణం లేకపోతే ఉత్తరమే ఉండదు. పడమర లేకుండా తూర్పు లేదు. ద్విపక్షాలతోనే దివ్యత్వం వస్తుంది. ఇంట్లో మీరు వాష్ బేసిన్స్ దక్షిణం గోడకు, పడమరకు పెట్టవచ్చు. డైనింగ్ టేబుల్ వద్ద ఎటు అనుకూలంగా ఉంటే అటు పెట్టండి. వాడిన సింక్ బేసిన్లలోని నీరు బయటికి వెళ్లే ఏర్పాటు చేసుకుంటే చాలు.
ఈశాన్యంలోనే పెట్టాల్సిన అవసరమేమీ లేదు.
– దాతల శ్రీనివాస్, ఆలేరు
మనం ఉంటున్న ఇంటి పక్కన స్థలానికి దక్షిణం-నైరుతిలో వీధిపోటు వచ్చినప్పుడు ఆ స్థలం ఖాళీగా ఉంటే.. ఆ వీధిపోటు ఫలితం మనకూ ఉంటుంది. దక్షిణంలో పార్కు ఉండి దానికి వీధిపోటు ఉన్నా.. దానితో కూడాదోషం ఉంటుంది. పార్క్ వల్ల, వీధివల్ల కూడా దోషాలే! కాబట్టి అన్నీ సరిగ్గా చూడాలి.

మీరు ఉన్న స్థలం లేదా కొన్న స్థలం పక్కన ఉన్న స్థలంలో ఇల్లు కట్టినప్పుడు.. ఆ స్థలానికి లేదా ఆ ఇంటికి మాత్రమే ఆ వీధిశూల ఫలితం ఉంటుంది. ఇల్లు కట్టనప్పుడు, అది ఇతరుల మీద రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ మనం ఆ వీధి పడకుండా జాగ్రత్తలు చేసుకొని ఇల్లు కట్టాలి. ఇతరులు అడ్డులేనప్పుడు ఆ వీధి వదిలిన బాణం (చెడు) మన మీదకే వస్తుంది. అన్నీ సరిగ్గా తెలుసుకొని నిర్ణయాలు తీసుకోండి.
– చీకోటి శ్రీనివాస్, దిల్సుఖ్నగర్
ముందు ఆ రెండిటిలో ఏది పెద్ద వీధో చూసి అటుదిక్కుగా ఇంటి ప్లాన్ చేయండి. మీది నైరుతి బ్లాక్ కాబట్టి ఏదైనా ఒక వీధినే ప్రధానంగా చేసుకొని ఇల్లు కట్టండి. పడమర వీధి వైశాల్యంగా ఉత్తరంవైపు వాలుగా ఉంటే పశ్చిమ ముఖంగా ఇల్లు కట్టుకోండి. చాలా బాగుంటుంది. ఒకే దిశకు రెండు గేట్లు పెట్టవచ్చు.

అయితే చాలా అపార్టుమెంట్లల్లో దక్షిణ-ఆగ్నేయం, దక్షిణ-నైరుతి వైపు గేట్లు అవసరం అయినపుడు దక్షిణం మధ్యలో.. దక్షిణ-ఆగ్నేయంలో, పడమర మధ్యలో, పడమర-వాయవ్యంలో గేట్లు పెట్టుకోవాలి. ఆ చివర, ఈ చివర అస్సలు పెట్టకూడదు. అలాగే ఒకే దిశకు మూడు గేట్లు పెట్టడం అస్సలు మంచిది కాదు. అన్ని సరిగ్గా చూసుకొని దిశలు నిర్ధారించాకే గేట్లు పెట్టుకోండి.
– కంది రాజు, షాద్ నగర్
కేవలం ప్రధాన వంట కోసం మీరు ప్రత్యేకంగా పెద్ద షెడ్డు వేసుకొని వాడుకునేందుకు స్థలం అనేది ముఖ్యం. అది నివాసానికి కాకుండా, వంటకు మాత్రమే ప్రత్యేకం కాబట్టి ఏ రోడ్డు ఉన్నా.. అందులో వంటకు వేరుగా ఒక నిర్మాణం, అలాగే ఎవరైతే పూర్తి బాధ్యత వహించి ఉంటారో అతనికి నైరుతిభాగంలో ఒక గది సపరేట్గా వేసుకోవాలి.

సరైన ప్లాన్ చేయగలిగితే రెండు రోడ్లు కలిసిన స్థలం తూర్పు-దక్షిణం లేదా పడమర-వాయవ్య స్థలంలో నిర్మాణం మీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పెద్ద క్షేత్ర వంటశాలకు ఇరుకు ఇండ్లు ఎంచుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. పెద్ద స్థలంలో చుట్టూ కనీసం ఇరవై అడుగులు వదిలి వంట నిర్మాణం చేసుకొనే స్థలాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అలాగే పనివాళ్లు ఉండటానికి సపరేట్ గదులు నిర్మించాలి. అన్నీ తెలుసుకొని కట్టండి. వ్యాపారం చక్కగా నిలబడుతుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143