– కె.ఎల్. రాము, మేడ్చల్
లే అవుట్ చేసేవారు అశ్రద్ధగా ఉంటే దిక్కులు సరిగ్గా లేని స్థలాలే పొందుతారు. ఒకనాడు ఈ విధమైన స్థలాలు అస్సలు ఉండేవే కాదు. ఈ మధ్య కేవలం స్థలం పక్కన రోడ్డు ఉంటే చాలు డబ్బులు వస్తాయనే వ్యాపార దృష్టి పెరిగి.. దిక్కులేని స్థలాలు పుట్టుకొస్తున్నాయి. ఈ రకమైన స్థలాలల్లో ఈశాన్యం రోడ్డు ఉంటే స్థలాలు వ్యాపారపరంగా ఉపయోగ పడతాయి. అలాంటి భూముల్లో షాపుల నిర్మాణం చేపట్టవచ్చు. దిశ స్థలానికి జీవనాడి లాంటిది. అది చక్కగా అమరి ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు సకల విధాలుగా శోభిస్తుంది. అన్నీ పండ్ల చెట్లే అయినా.. వాటన్నిటికీ మామిడికాయలు కాయవు కదా! అయినా వాటిని కూడా ‘చెట్లు’ అనే పిలుస్తాం. ఇవి కూడా అంతే!
– కృష్ణ, కోరుట్ల
దక్షిణంలో అంతస్థలం ఖాళీగా ఉండకూడదు. ఆ వైపు ఉత్తరం కన్నా తక్కువ ఉండేలా ఒక అంగుళం మాత్రమే తగ్గించి గోడ కట్టుకోవాలి. ఉత్తరంలో కూడా మీరు వదిలిన స్థలం చాలా తక్కువ ఉంది. అటు దిక్కు కనీసం నాలుగు అడుగులైనా ఉండాలి. ఇంటికి ప్రదక్షిణం ఉండాలి కదా! మీరు అవకాశం ఉంటే ఉత్తరం స్థలం కొని పెంచుకోండి. తద్వారా ఎంతో వృద్ధిని పొందుతారు. దక్షిణంలో తగ్గించి ఖాళీ స్థలం ఉండేలా చూడండి.

మీరు దక్షిణంలో కాంపౌండ్ కట్టిన తర్వాత ఆ స్థలం ఇతరులకు ఇవ్వండి లేదా అమ్మండి. కుదరకపోతే వేరే వారిపైన రిజిస్ట్రేషన్ చేయండి. అప్పుడు ఆ స్థలం మీకు వర్తించకుండా ఉంటుంది. దక్షిణం పెంపు వల్ల ఆరోగ్య- ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
– మచ్చ సుభాషిణి, మోత్కూరు
మీ స్థలానికి ఒక వీధిచూపు ఉంది. ఒక వీధి పోటు ఉంది. వీధి పోటు దక్షిణ-నైరుతిలో ఉంటే దక్షిణంలో రోడ్డు పడే మేరకు స్థలం కట్ చేయండి. అప్పుడు ఆ దోషం పోతుంది. పడమర-వాయవ్యం మంచి రోడ్డు ఉంటే మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడు ఆ స్థలంలో ఇల్లు వాస్తుకు కట్టుకోండి. ఏ రకమైన ఇబ్బందులు ఉండవు.

స్థలశుద్ధికి అవకాశం ఉన్నప్పుడు భయంలేదు. నైరుతి వీధి పోటు లేకుండా చేసుకోవడం తెలివైన పని. శాశ్వతంగా ఆ స్థలం నిలబడుతుంది. ఆ స్థలం మీకు చక్కగా ఉపయోగంలోకి వచ్చినట్టు అవుతుంది. అమ్ముకోవాల్సిన అవసరం లేదు.
– కందుల వెంకట్, కోరుట్ల
ఇంటికి మూలలు ఎందుకు తెంపు చేయాలి? తెంపు చేయడం శాస్త్రం కాదు. అలాగే ఈశాన్యం కట్ చేసి కారు పార్కింగ్ చేయడం సమ్మతం కాదు. ఇవన్నీ వ్యాపారులు సృష్టించినవి. శాస్త్ర అంశాలు కావు. మీరు ఏ మూల కట్ చేయకుండా ఇల్లు కట్టండి. తూర్పు-ఈశాన్యం కోణంగా పెరిగి, తూర్పు-ఆగ్నేయంలో మూల ఇంటికి నిలబడని పక్షంలో ఆగ్నేయం ఒక లెక్కతో తెంపండి. వంట గదిని పూర్తిగా కోల్పోకుండా ఇల్లు కట్టడం ఒక సవరణ.

అది అన్ని వేళలా పనికిరాదు. అవసరం కూడా లేదు. అన్నీ తెలుసుకొని చేయాలి. నాలుగు మూలలు నిలబడే గృహం, మనం వాడకోగలిగే గృహం ఎంతో గొప్పది. సాధ్యం అయినంత మేరకు పూర్ణ గృహం కట్టుకోవాలి. అప్పుడే రావాల్సిన మూల గదులు ఇంటిలో చక్కగా అమరుతాయి. ఇంటి విషయంలో రాజీ పడకుండా ఇల్లు కట్టాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143