– సిరికంద లక్ష్మి, ఉప్పల్
మన గృహానికి మనదైన కాంపౌండ్ ఉండటం మంచిది. ఎదురింటివాళ్లు వారి ఇంటి లెక్కలకు అనుగుణంగా నిర్మించుకుంటారు కదా. మన తూర్పు ప్రహరీ మన ఇంటికి ఉన్న పడమర కాంపౌండ్ కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. ఎదుటివారి ఇల్లుకు మన తూర్పు.. పడమర అవుతుంది. వాళ్ల తూర్పు ప్రహరీకన్నా అది ఎత్తు పెంచి కడతారు. ఇద్దరి పొత్తులో కాంపౌండ్ కట్టుకున్నా.. లెక్కలు వర్తించవు.
కొన్నిచోట్ల మన తూర్పులో వాళ్ల ఇల్లే హద్దు మీద కడతారు. అలా కూడా ఆ గోడ ఉంటుంది. అది మరీ దోషం. ఎదుటివారి నిర్మాణం మీద ఆధారపడకుండా మన ఇంటికి మన రక్షణలో మనదైన లెక్కలతో కాంపౌండ్లు కట్టుకోవాలి. భవిష్యత్తులో ఇంటి మార్పులు చేసుకున్నా మన ఇంటికి మనదైన రక్షణ ఉంటుంది.
– ధనలక్ష్మి, సిద్ధిపేట
మీరు అడుగుతున్నది మీ స్థలానికి వీధి చూపు విషయమే కదా! అది ఎలాంటి స్థలానికైనా ఉంటుంది. కొన్నిటికి మాత్రమే అని నియమమేమీ లేదు. అన్ని దిక్కుల్లోని స్థలాలకూ వీధి పోట్లు-వీధి చూపులు వర్తిస్తాయి. వీధి ఎదురుగా వచ్చినా భయపడకూడదు. అలా వచ్చే ప్రతి వీధీ చెడు కలిగిస్తుందని అనుకోవద్దు. నిర్ధారించుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలి.

కొన్ని వీధులు ఈశాన్యం దిశకు పడినా.. అక్కడ సరైన దిశ ఉండనప్పుడు ఫలితం మారిపోయే అవకాశం ఉంటుంది. ఎదురు వీధిని జాగ్రత్తగా చూసి, అది ఎలాంటి స్థలమో తెలుసుకోండి. అది మంచి స్థలమైనా… తగిన పద్ధతిని అనుసరించే ఇంటి నిర్మాణం చేయాలి. మీరు మంచి వీధిని కలిగి ఉన్నా.. ఇల్లు మాత్రం శాస్త్రపరంగా కట్టుకోండి.
– బద్దుల సోమనాథ్, మోటకొండూర్
నైరుతిలో గొయ్యి దోషం. ఆ మూలన పెద్ద గుంత తీసి అందులో గులకరాళ్లు, ఇసుకతో నీటి ఇంకుడు గుంత చేశారు. అది మట్టితో మూసినట్టు ఉన్నా.. మీ ఇంటి నీళ్లన్నీ అందులోకి వెళ్తున్నాయి. అంటే ఆ గొయ్యి ప్రాణంతోనే ఉంది. కాబట్టే, నీళ్లన్నిటినీ అది స్వీకరిస్తుంది.

అది మూసినట్టు అనిపించినా.. గొయ్యిగానే భావించి వెంటనే తొలగించండి. అందులోకి నీళ్లు పంపడం ఆపి, ఈశాన్యం లేదా తూర్పు ఉత్తరంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోండి. అలాగే నైరుతి దిశలో ఉన్న స్లోప్ను సవరించి నైరుతి మూలనుంచి అటు తూర్పునకు, ఇటు ఉత్తరానికి స్లోప్ ఉండేలా సరిచేయండి.
– చిన్నికాడల రాజు, వారాసిగూడ
ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కొన్నిటికి కొన్ని నియమాలు యథాతథంగా ఉండేలా మనం జాగ్రత్త పడాలి. లేదంటే మన జీవనశైలిలో అవకతవకలు వస్తుంటాయి. మీ ఇంటిలో ఉత్తరం మధ్యన ఉన్న పోర్టికో బాల్కనీలాగా ఉత్తరం గోడమీద లోడు తీసుకొని కమ్ముకున్నట్లుగా వేశారు. అది అలా ఉండటం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉత్తరం విత్తం అంటారు.

అంటే.. ఉత్తరం మూత వల్ల డబ్బు సమస్య, స్త్రీకి అనారోగ్యం, ఆనందం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంటనే ఉత్తరం దిక్కు కాంపౌండ్ మీద నుంచి దానిని తొలగించండి. దక్షిణం కన్నా తక్కువ ఎత్తు ఉండేలా ఉత్తరం కాంపౌండ్ ఎత్తును సరిచేయండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143