– బాదం పద్మనాభం, పటాన్చెరు
ప్రస్తుతం ఎంతోమంది కడుతున్నారు. వాళ్లంతా అడిగి కడుతున్నారా? నచ్చిన చోట కట్టుకుంటున్నారు. దేశంలో స్థలంలేక కాదు. అందరూ పట్టణాల్లోనే ఉండాలనే ఆలోచన చేత. అందరికీ మహానగరాలు కావాలి. వాటిల్లో నీళ్లు, హోటళ్లు, రోడ్లు, భద్రత, విద్యుత్తు వంటి సౌకర్యాలన్నీ ఉండాలి. వీటిలో ఏది లేకున్నా.. ఇదేం నగరం? ఇదేం బతుకు? అని మనమే బాధపడుతూ ప్రభుత్వాలను నిందిస్తుంటాం. మంచి స్థలాలున్నా కూడా మనం కోరుకునే ఏరియాల్లో అవి ఉండటం లేదు.
మంచి స్థలం అనేది మనం కోరుకుంటున్నప్పుడే వెతుకుతాం లేదా ఉన్నదాంట్లోనే కట్టుకుంటాం. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలనుకున్నా.. ఉండేచోటు, తినే తిండి మంచిది కావాలనుకోవడం తప్పుకాదు. అది నివాస స్థానమైనా, ఆహారమైనా! ఒంట్లోకి వెళ్లే వాటితోపాటు ఒంటికి చుట్టూ ఏముందనేది కూడా గమనించాలి. శరీరం కేవలం నోరుతో మాత్రమే లేదు. ఇంద్రియాల్లోని ప్రధానమైన మనస్సుతో కూడా ముడిపడి ఉందన్న విషయం గమనించాలి. దాన్ని మలినం చేసుకోకుండా ఉండాలి. అడ్జస్టు చేసుకోవడం కాదు.. ఉన్నస్థితి నుంచి ఉన్నతికి మారితేనే శుభం. శాస్ర్తాలు ఇచ్చే సూచనల వల్ల నిత్య శుభాలే.
– ఎంఆర్ బాబు, హన్మకొండ
ఇంటికి ద్వారం పెట్టడానికి ముందు దిశను నిర్ధారించాలి. వీధిని అనుసరించి ఇల్లు కట్టినా.. తూర్పు హాల్కా, లేదా ఇంటి ఈశాన్యం గదికా? ఏ దిక్కు తలుపు పెడుతున్నారు? అనే నిర్ణయం ప్రకారం ఆ స్థానం సరిచూసుకోవాలి. తూర్పు ద్వారం తప్పనిసరి కాబట్టి బీములు అడ్డం రాకుండా చూడాలి. ఇంటికి పెట్టే ప్రధాన ద్వారమేకాదు.. ఏ ద్వారం మీద కూడా అడ్డ బీములు రాకూడదు.

కాబట్టి ఇంటి ద్వారం స్థానం మార్చక తప్పదు. ద్వారాన్ని తూర్పు సెంటర్, ఈశాన్యం దిశకూ పెట్టుకోవచ్చు. కాబట్టి ద్వారం స్థానాన్నే మార్చండి. కొందరు బీము వచ్చింది అని ద్వారానికి పైన బీము కనిపించకుండా ఫాల్స్ సీలింగ్ వేస్తారు. హాల్‌కు తదితర ఆవరణ దోష నివారణకు మాత్రమే ఫాల్స్ సీలింగ్ పనిచేస్తుంది. అది ద్వారం విషయంలో పనికిరాదు. మీరు ద్వారం మరొకచోటుకు జరపండి. ఉచ్ఛమైన స్థానం అయితే సరిగ్గా సరిపోతుంది.
– గల్ల దామోదర్, లద్నూర్
ఇంటికి ఉపగదులు కట్టడానికి నైరుతి ఒక్కటే కాకుండా ఇతర దిశలు కూడా ఉన్నాయి. నిజానికి నైరుతి స్థానం స్టోర్లకు, బరువులకు మాత్రమే కాదు. అది జీవశక్తి స్థానం. ఇంటికి చుట్టూ ఉన్న స్థలాన్ని బట్టి వాయవ్యంలో లేదా ఇంటి తూర్పు-ఆగ్నేయంలో గదిని కట్టుకోవచ్చు.

ఆగ్నేయం, వాయవ్యం దిశలలో కూడా స్టోర్ నిర్మాణం చేసుకోవచ్చు. ఇది ఎలాంటి దోషం కాదు. నైరుతిలో గదికట్టాలి అంటే ఇంటి యజమానికి ఉపయోగపడేలా ఉండాలి. పూజగదిలో పెట్టే వస్తువుకు ప్రాధాన్యం ఉన్నప్పుడు నైరుతి స్థానాన్ని గుర్తించాలి. లోకదృష్టితో కాకుండా ఆలోచించి కట్టుకోండి.
– భారతి, ఎల్బీ నగర్
భౌతికంగా పొయ్యిలో నీళ్లు పోస్తున్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. నిజానికి పంచభూతాలన్నీ కలగలిసే ఉంటాయి. నీటిలో అగ్ని దాగుంటుంది. ఆగ్నిలో నీరు ఉంటుంది. వాటి కలయికే కదా.. జలవిద్యుత్తుగా మారింది. ఎండ నుంచే కదా వర్షం కురిసేది. సమస్త భూతాల సమష్టి రూపమే శాస్త్రం.

దేనిని ఎలా వాడాలో చెప్పింది కూడా శాస్త్రమే. వంటగది పక్కన దక్షిణ ఆగ్నేయంలో పాత్రలు గడగడానికి సింకు యుటిటిలీ ఉండవచ్చు. అలాగే, వంటగదికి ఈశాన్యంలో కూడా సింకు ఉండవచ్చు. వంటగదిలో ఉందికదా అని ఎవరు కూడా సింకు మీద వండరు కదా!? పొయ్యిమీద పాత్రల్ని కడగరు కదా?! వ్యవహారానికి అన్నీ కావాలి. అన్నిటికీ అన్నిరకాల స్థానవిద్య ఉంటుంది. శాస్ర్తానికి ఈ విషయాలన్నీ తెలుసని గ్రహించండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143