– ఆది భాగ్యశ్రీ, కొల్లూరు
ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికోసం అనేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు కేవలం భూమిని ఆనుకొని మందంతో కూడిన గోడలతో ఇల్లు కట్టుకునేవాళ్లు. అవన్నీ మట్టి గోడలు అయినందున ఆ గోడలమీదనే గోడలు రావాల్సిన అవసరం ఏర్పడేది. కానీ, ప్రస్తుతం పిల్లర్లను నిలువుగా, బీములను అడ్డంగా.. బలంగా వేసుకొని గృహ నిర్మాణాలు చేస్తున్నాం. కాబట్టి ఏ ఫ్లోర్ ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. కాకపోతే ఏ ఫ్లోర్‌కు ఆ ఫ్లోర్‌ని అవసరమైన విభజనతో కట్టుకోండి. అందుకుగాను గోడల ప్రమాణాలు ముందుగానే ప్లాన్ చేసుకోండి. తగినంత బీముల నిర్మాణాన్ని పటిష్ఠంగా చేసుకొని గదులను, మెట్లను విభజించుకొని నిర్మించుకోండి.
– కాతోజు శ్రీదేవి, నాంపల్లి
దక్షిణంవైపు మాస్టర్ గది చేసుకుంటే దాన్ని మూడు భాగాలు చేయాలి. ముఖ్యంగా దక్షిణం వైపున్న పడకగదికి ద్వారం సెంటర్లో గానీ ఈశాన్యంలో గానీ స్థిరపరుచుకోవాలి. అందరూ పడకగది పెట్టి మిగతా తూర్పు భాగమంతా ఆ బెడ్రూమ్కు కలుపుకొంటారు. అది మంచిది కాదు. మీరు ఆ పెద్ద పడక గదికి బాల్కనీ పెట్టాలనుకుంటే.. తూర్పు భాగంలోని మొత్తం దక్షిణ ఆగ్నేయంలో బాల్కనీ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ బెడ్రూమ్కు తూర్పువైపు ఏర్పాటు చేసుకున్న బాల్కనీకి తలుపు పెట్టొద్దు. ఆ పడక గదికి దక్షిణం వైపు ఆనుకొని మరుగుదొడ్లు నిర్మించుకోవాలి.
– కావేరి శశికళ, నిజామాబాద్
మీరు ఏర్పాటు చేసుకునే ఆ రూమ్ నిర్మాణంలో తూర్పు-పడమర పొడవుగా ఉంటే.. దక్షిణ-పడమరలు తక్కువ వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి. పైగా పశ్చిమ నైరుతి తోక లాగడంతో మిగతా పశ్చిమ-వాయవ్యాలలో లిఫ్టు-మెట్లు వచ్చాయి. కాబట్టి, పెరిగిన నైరుతి భాగాన్ని వదిలి.. మిగతా దీర్ఘ చతురస్ర భాగం మాత్రమే మీ వ్యాపారానికి వినియోగించుకోండి. పెరిగిన భాగాన్ని యజమాని మాత్రమే వాడుకోవాలి. వ్యాపార భాగంలోకి తీసుకురావొద్దు. ఎలక్ట్రిక్ రూమ్‌గా అస్సలు వాడొద్దు. అలా చేయలేదంటే చాలా వ్యత్యాసాలు వస్తాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక-ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
– అందె వెంకటేశ్, కోరుట్ల
ఇంటి లోపల గాలి-వెలుతురు కోసం కిటికీలను అమర్చుతాం. అవి గోడలతో కలిసిపోతాయి. అవి మనకు ఆటంకాలు కావు. కాబట్టి వాటికి పోట్లు ఉండవన్న సంగతి గమనించాలి. కిటికీలు.. ద్వారాలకు ఎప్పటికీ పోట్లు కావు. ఒక కిటికీని మరో కిటికీకి ఎదురుగా పెట్టడం, ద్వారాన్ని మరో ద్వారానికి ఎదురుగా పెట్టడమనేది మన అవసరం. ఇక మెట్లు ఎదురుగా వచ్చినప్పుడు ఆ మెట్ల సెంటర్ తలుపులకు ఎదురుగా పెట్టుకోవచ్చు. కానీ, మెట్ల కోణం మారితేనే ఇబ్బంది. మీది డూప్లెక్స్ ఇల్లు అంటున్నారు. కాబట్టి ఇంటిలోపల మెట్ల వెడల్పును చూసుకొని తగిన ద్వారాన్ని నిర్ణయించుకొని.. సరిగ్గా ఎదురుగా నిలబెట్టండి. అందులో ఎలాంటి దోషం లేదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143