– ఎం. రామనాథం, ఎల్బీ నగర్
ఇంటికి దగ్గరలో కాలువలు, చెరువులు ఉండటం ఏ మాత్రం మంచిదికాదు. పైగా దక్షిణం దిక్కుకు ఉందని అంటున్నారు. ఆ దిక్కున ఉన్న నీటి ప్రవాహం పిల్లల మెదడుపైనా, స్త్రీల హార్మోన్ల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మన ఇంటికి దూరంగా చెరువు ఉండటం వేరు. చెరువును ఆనుకొని ఇల్లు ఉండటం వేరు. మనచుట్టూ ఉన్న పంచభూతాలు సమస్థితిలో ఉండాలి. వాటిలో ఏది ఎక్కువైనా మనకే నష్టం. చాలామంది మంచి వ్యూపాయింట్ కోసం చెరువులు, వాగులు, కాలువలు ఆనుకొని ఇండ్లు నిర్మిస్తారు. అవి అందం కంటే అనారోగ్యాలను తెచ్చిపెడుతుంటాయని గమనించరు. వాటివల్ల స్త్రీల నెలసరి దెబ్బతింటుంది. ప్రస్తుతం మీరు చేయాల్సిన ఒకే ఒక పని.. ఇల్లు మార్చుకోవడమే. చెరువుకు దూరంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి.
– కాళోజీ పద్మ, పటాన్చెరు
కిటికీలు ఎన్ని పెట్టినా ఫర్వాలేదు కానీ.. అవి ఉచ్ఛమైన స్థానంలో ఉంటే సరిపోతుంది. వాటిని ఆఫ్రౌండ్ ఆకారంలో బయటి భాగంలోకి పెట్టినప్పుడు.. ఇంట్లోని ఆ గది ఆవరణ కొలతలు
మారిపోతుంటాయి. ఒక గోడకు కిటికీని బాక్స్‌గా బయటికి పెట్టే రేకులు లోనికి తెరుచుకునేలా ఉంటే ఇబ్బంది ఉండదు. అప్పుడే ఆ గది ఫ్లోరింగ్‌లో ఎలాంటి తేడా రాదు. గోడకు పైన రెండున్నర అడుగుల తరువాత కిటికీ వస్తుంది. మొత్తంగా పశ్చిమంలోని ఇంటి బయటికి నెట్టి అర్ధ చంద్రాకారంగా పెట్టినప్పుడు ఆ గది వైశాల్యంలో తేడాలు వస్తాయి. అది నైరుతిని పెంచుతుంది. వాయవ్యంలో కూడా ఇదే వర్తిస్తుంది. కాబట్టి అలాంటి కిటికీలు మంచివి కావు.
– దామోదరం లింగరాజు, మోతీనగర్
గదికి తలుపులు అనేవి కీలకం. రాకపోకలకు ఇబ్బంది లేకుండా అవి ఉండాలి. ఎక్కడైనా ఒక మూలన.. అంటే ఉత్తరం-ఈశాన్యం లేదా దక్షిణం-ఆగ్నేయం దిశగా పెట్టడానికి నిర్ణయించుకుంటే ఉత్తరం-ఈశాన్యంలో గది తలుపు లోపలికి వెళ్తున్నప్పుడు ఎడమ దిక్కుకు వెళ్లి స్థిరపడాలి. దక్షిణం ఆగ్నేయంలో గది తలుపు కుడి దిక్కుకు వెళ్లి నిలబడాలి. ఆ విధంగా గది వైశాల్యాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇదంతా ఒక్క రెక్క ఉన్నవాటి విషయం. ద్వారానికి రెండు రెక్కలు పెట్టినట్లయితే ఏ ఇబ్బందీ రాదు. ఎక్కడివి అక్కడే అమరి ఉంటాయి. హాల్‌కు ఉత్తర ద్వారంలో రెండు రెక్కలు పెట్టడం తప్పనిసరి.
– వారాల శంకర్, దిల్సుఖ్నగర్
ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో సెప్టిక్ ట్యాంకులు నిర్మించుకోవచ్చు. ప్రధానంగా సెప్టిక్ ట్యాంక్ అనేది డ్రైనేజీ రానిచోట అవసరం అవుతుంది. ఇది ఉత్తరం మధ్యలో కానీ.. తూర్పు మధ్యలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిలోపల అన్నిచోట్ల గోతులు తీయొద్దు. చాలామంది ఆగ్నేయం- వాయవ్యం దిశలకు సెప్టిక్ ట్యాంక్ నిర్మిస్తారు. అవి రోగాలకు కారణమవుతాయి. మీరు రెండు సెప్టిక్ ట్యాంకులు అంటున్నారు కాబట్టి ఒక్కచోటనే అవసరం మేరకు తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లోని ఆవరణలో సెప్టిక్ ట్యాంక్‌తోపాటు నీళ్ల సంపు, బోరు కూడా ఉంటాయి కదా. ఆ విధంగా రెండు సెప్టిక్ ట్యాంకులను నిర్మించడం వల్ల ఇతర అవసరాలకు చోటు సరిపోదు. అందుకే తూర్పు దిక్కున గోడబయట తూర్పు సెంటర్లో ఏర్పాటు చేసుకోండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143