– మిత్రకుమార్, రామునిపట్ల
మట్టిలో ఉన్న మాతృత్వ లక్షణం గాజులో ఉండదు. బయట ఏదుంటే దాన్నే లోపలికి స్వీకరిస్తుంది. ఎండుంటే ఎండ.. వర్షాభావం ఉంటే మబ్బుతనాన్ని ఆహ్వానిస్తుంది. ఇంటిని ఇటుకలు, మట్టి గోడలు కాపాడినట్లు.. గాజులు కాపాడవు. మనిషి శరీరం ఒకటే అయినా అరికాళ్ల వద్దనున్న చర్మం, చెంపల మీదనున్న చర్మం వేరుగా ఉంటుంది కదా! అందుకే అది ఇల్లయినా, ఆఫీస్ అయినా.. విశ్వ వాతావరణానికి విభిన్నంగా ఉంటేనే మన శరీరం సానుకూలంగా ఉంటుంది.
నిర్మాణాలు చూసేందుకు బాగుండాలని మాత్రమే కట్టొద్దు. ఆరోగ్యంతోపాటు ఆలోచనలు కూడా బాగుండాలనే కోణంలో నిర్మించండి. నేడు ఇటుకల కన్నా గ్లాస్‌నే అధికంగా వాడుతున్నారు. గ్లాస్‌తో నిర్మాణం వేగంగా పూర్తవుతుందనే వ్యాపార ధోరణితో ఆలోచిస్తున్నారు. దానివల్ల ఉపయోగం, భద్రతను మరిచిపోయారు. ఇంటికి గ్లాస్ గోడలు అస్సలు పనికిరావు. ఒకవేళ ఆఫీస్కోసమైతే అవసరం ఉన్నంత మేరకు వెంటిలేషన్ కోసం మాత్రమే వాడుకోండి.
– మారుతి శ్రీనివాస్, పెంబర్తి
ఇల్లు ఎక్కడ కట్టినా ప్రహరీలు నిర్మించడం అవసరం. వాతావరణంతోపాటు రకరకాల కారకాలు ఇంటిని ఆక్రమిస్తాయి. వాటి నుంచి గృహానికి రక్షణ తప్పనిసరి. గ్రామాల్లోని ప్రజల ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. వాళ్లు వీధులను దృష్టిలో పెట్టుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయినా కూడా పల్లెల్లో కాంపౌండ్ నిర్మిస్తే ఇంటికి మరింత శక్తి చేకూరుతుంది.

ప్రాకారం ఇంటికి రక్షణ కవచం. అన్ని నీళ్లే అయినా వడకట్టుకొని వాడుకోవడం వర్తమాన పరిస్థితులలో ఎంతో అవసరం కదా. అదేవిధంగా శాస్త్రబద్ధంగా ఇంటికి కనీసం ఆరు- ఏడు అడుగుల దూరంలో ప్రహరీలు నిర్మించడం మంచిది. అప్పుడే ఆ ఇల్లు ఇంటి వారితో మమేకం అవుతుంది. హద్దు శక్తిని విచ్ఛిన్నం చేయదు. కాబట్టి, మీరు ప్రహరీలతో ఇల్లు కట్టండి.
– శ్రీధర్, మారేడ్‌పల్లి
గదులు చిన్నగా ఉండి అవసరాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా డబుల్ హైట్ బెడ్స్ అవసరం ఏర్పడుతుంది. ఇంటి ప్రధాన గదిలో కాకుండా మిగతా అన్ని గదుల్లో వేసుకోవచ్చు. మాస్టర్ గదిని ఎలాగూ పిల్లలు వాడుకోరు కాబట్టి.. మిగతా ఆగ్నేయం, వాయవ్యం గ
దుల్లో వేసుకోండి.
అదికూడా తల ఉత్తరం దిక్కు కాకుండా దక్షిణం ఉండేలా ఏర్పాటు చేసుకోండి. గదిలో తూర్పు, ఉత్తరం ఖాళీ ఉండేలా మంచాన్ని అమర్చుకోవాలి. పై బెడ్‌కి మెట్లు కాళ్లవైపు వచ్చేలా పెట్టించుకోవాలి. ఇద్దరు పిల్లల్లో ఎవరు ఏ బెడ్ అయినా వాడుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా అమర్చుకోండి.
– మాలోతు వెంకట్, మహబూబాబాద్
హద్దులు ఉండని ఓపెన్ స్థలం మీది. ఎవరూ కూడా యాభై, డబ్భు ఎకరాల భూమికి కాంపౌండ్ కట్టరు. కానీ, ఒక హద్దు అనేది ఏర్పాటు చేసుకుంటారు. ముందు మెయిన్ క్వారీకి మీరు దక్షిణంవైపు లేదా పడమరవైపు ఒక ఆఫీస్ గదిని కట్టండి. దాని దగ్గరలో తూర్పు-ఆగ్నేయం లేదా వాయవ్యంలో స్థల నిర్ధారణ చేసుకొని వంటగదిని నిర్మించుకొని.. దానికి అనుబంధంగా భోజనహాల్ను ఏర్పాటు చేసుకోండి.

ఆఫీస్‌తోపాటు ఈ గదులన్నిటికీ ఒక కాంపౌండ్ ఉండటం తప్పనిసరి. అప్పుడే దిక్కులు నిలబడతాయి. అదేవిధంగా తూర్పు లేదా ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ కట్టండి. క్వారీలో స్థాన నిర్ణయం ముఖ్యం. ఏది ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో పెట్టడం ఎంతో అవసరం.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143