– కె. శ్రీనివాస్, మంచిర్యాల.
జీవితాన్ని ఒకే కోణంలో చూసి నిర్ణయించలేము. ఒక నది.. తాను పుట్టిన చోటునుంచి ఎన్ని మలుపులు తిరుగుతూ.. ఎన్ని ముళ్ల పొదలు దాటుతూ సాగుతుందో లెక్కించలేము. అలాగే.. మానవ జీవితం కూడా! మనం అనుకున్నట్టు మనకు తెలిసిన ఈ ఒక్క జీవితమే కాదు.. ఎన్నో జన్మలు, కార్యాలు, ఆలోచనలు, వ్యసనాలు మనకు తెలియకుండా మనల్ని అంతర్గతంగా ప్రేరేపిస్తుంటాయి. అన్నివేళలా మనిషి స్పృహతో ఉండలేడు. ఈ కాలంలో మనిషి ఆనందసమయం చాలా క్షీణించి పోయింది.
కారణం ఒక్కటే. మనలో కృతజ్ఞత లోపించడం. అది ఎవరి పట్లనో కాదు.. ప్రకృతి పట్ల. దైవం పట్ల. ఈ మాట చాలా సాధారణం అనిపిస్తుంది. కానీ, గత కొన్నేళ్లుగా ప్రకృతిమీద మనిషి చేస్తున్న దమనకాండ.. ఇవ్వాళ మనిషి జీవనాడుల మీద తిరగబడింది.అందుకే..హోదా-డబ్బు- పలుకుబడి-జనబలం ఉన్నా.. కేవలం వ్యక్తిత్వం లేక మనిషి కుంగిపోతున్నాడు. ప్రకృతికి మనం ఏమిస్తే.. అదే మనకు తిరిగి ఇస్తుంది. ఇప్పుడు కూడా అంతే! విధ్వంసమే ఇస్తున్నది. మనం మరిచిపోయినా.. ప్రకృతి మరిచిపోదు. కానీ, తిరిగి తీవ్ర ఫలితాలు పొందుతుంటే అదేదో ఎవరికీ జరగని అన్యాయం మనకే జరిగినట్టు ఫీలవుతాం. అది ఎన్నో ఇచ్చినా ప్రకృతికి కనీసం మనం ఏమీ తిరిగి ఇవ్వకపోయినా.. రుషుల జీవన విధానం అవలంబిస్తే చాలు. జీవితం ఆనందమయం అవుతుంది.
ఇక్కడ మనిషి తన ముందు తాను ఓడిపోతున్నాడు. తనకు నచ్చిన తీరులో ఇల్లు కడుతున్నాడు. తనకు అనుకూల వాతావరణం కావాలంటాడు. తాను మాత్రమే బాగుండాలని అనుకుంటాడు. ఇలా.. మనిషి కుంగుబాటుకు ఇల్లుతోపాటు అతని జీవనశైలి, అతని స్వభావాలు కూడా జతకలుస్తాయి. మంచి ఇంటిలోకి వెళ్లనీయవు. ఇల్లు కట్టారు అంటున్నారు. దాని వివరాలు, ప్లాను, దిశలు పూర్తిగా ఇవ్వలేదు. కొత్త ఇంటికి వీధిపోట్లు ఉంటే.. అవి నైరుతి – వాయవ్యం అయితే, మానసికంగా, శారీరకంగా కుంగిపోతుంటారు. వాటిని జాగ్రత్తగా పరిశీలించి సరిచేసుకోండి. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం వల్ల మనోశాంతి కలిగే అవకాశం ఉంటుంది. గృహాన్ని – గుణాన్ని ఎప్పుడూ సక్రమ మార్గంలో పెట్టుకోవాలి.
– వి.ఎల్. శ్రీధర్, కరీంనగర్.
ప్రతి ఇంటివారికి ఒక ఇంటిదైవం (కులదైవం) ఉంటారు. ఆ దేవుణ్ని పెట్టుకున్నాక.. ఇతర దేవుళ్లను మీ ఇష్టానుసారం పెట్టుకోవచ్చు. ఇంటిలో దైవం-పూజ అనేది చాలా పవిత్రమైన శాస్త్ర సంప్రదాయం. నిత్యం ఉదయం, సాయం సంధ్యలలో దేవతార్చన చేయడం ఎంతో యోగం. అది అందరికీ సాధ్యంకాదు. ఇంకా ఎంతమంది దేవుళ్లను పెట్టాలి? ఎన్ని గంటలు పూజించాలి? ఎప్పుడూ దీపాలు వెలుగుతూనే ఉండాలా? అనే ఆలోచన కాదు. మనం మన చిత్తశుద్ధి కోసం నిత్యం పూజలు చేస్తాం. అలాగని పూజగది ఉంటేచాలు అనుకోవద్దు. మన వ్యక్తిగత సాధన ఎంతో అవసరం.
వ్యక్తి.. తన బాధ్యతలు సమర్థంగా పూర్తి చేసుకొని జన్మ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక దారిని కూర్చేది పూజగది. మనిషి బహిర్గత దృష్టినుంచి అంతర్ముఖం చెంది.. జ్ఞానిగా మారడానికి మార్గంగా పూజాదికాలు చేయాలి. అందుకు నిత్య అనుష్ఠానం అవసరం. గురువును ఎంచుకొని భగవంతుణ్ని సర్వత్రా దర్శిస్తూ.. తన పర భేదం లేకుండా జీవించే మహోన్నత వైభవంతో మనిషి తన జీవయాత్ర పూరించాలి. ఎంతటి మహా వ్యక్తికైనా ఒక ముగింపు ఉంటుంది. అది మనకు మన పూర్వులు చూపించిన మార్గం. అందుకు ఇంటిలోనే ఒక రూటు మ్యాపును అందించారు. అదే.. నిత్యానుష్ఠాన మార్గం. నిత్యం భగవంతుడి మార్గంలో ఉండండి. అన్నీ మీకే అవగతం అవుతాయి. శుభమస్తు.
– జి. భారతి, మాదన్నపేట.
ఇంటికైనా, కాంపౌండుకైనా.. బేస్మెంట్ ఉండాలి కానీ, రెండిటికీ సంబంధం లేదు. ఇంటి ఎత్తు, దాని వైశాల్యం అన్నీ దృష్టిలో పెట్టుకొని.. ముఖ్యంగా రోడ్డును అనుసరించి ఇల్లు బేస్మెంట్ వస్తుంది. రోడ్డు నుంచి ఇంటి బేస్మెంట్ ఎంత అనేది బీములు వేయకముందే నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా రోడ్డు ఎత్తునుంచి కాంపౌండు లోపలి భాగం ఒకటిన్నర అడుగు పెట్టుకొని, అక్కడినుంచి ఇంటి ఫ్లోరింగ్ మరో అడుగున్నర ఎత్తు పెట్టాల్సి ఉంటుంది. అది సరిపోతుంది.
ఇక దాని ఎత్తుకన్నా కాంపౌండు బేస్మెంట్ ఎత్తు ఎంత అవసరం ఉండదు. ప్రహరీ నిలవడానికి సరిపడే ఎత్తు భూమిలోనుంచి నాలుగు వరుసలు రాళ్లతో కట్టి, దానిపైన కాంపౌండు గోడను అవసరమైనంత ఎత్తు పెట్టుకుంటే చాలు. కొందరు కాంక్రీటు కాంపౌండు కూడా పెడతారు.. భూమి లోపలి నుంచే. అప్పుడు బేస్మెంట్ ప్రశ్నే ఉండదు కదా! కాబట్టి, దేని పటిష్ఠత కోసం దానికి అవసరమైన బేస్మెంట్ కానీ, ఇంటికి-ప్రహరీలకు సంబంధం ఉండదు. మీరు దేనికి దానికి టెక్నికల్‌గా సూచన చేసుకొని ఇల్లు నిర్మించుకోండి.
– ఎం. చంద్రశేఖర్, కొండగట్టు.
చాలామంది పారు పట్టి ఇల్లు కడుతుంటారు. మీరు, మీ అన్న ఎవరి స్థలం వాళ్లు పంచుకున్న తర్వాత.. ప్రధానంగా ఎవరి కాంపౌండు వాళ్లు వేరు చేసుకోండి. అలా స్థలం ఎవరికి వారు చేసుకోవడం వల్ల పారు లెక్కలు ఉండవు. ఎవరి కాంపౌండులతో ఎవరికి అవసరమైన ఇంటిని వారు శాస్త్రబద్ధంగా కట్టుకోవచ్చు. మీ అన్న దక్షిణం హద్దు మీద ఇల్లు కట్టినట్టు చెబుతున్నారు. అలా కట్టడం మంచిదికాదు. మీరు మీ ఇంటిచుట్టూ ఖాళీ స్థలం వదిలి కట్టాల్సి ఉంటుంది. అన్న కట్టినట్టే కట్టాలి అనేది కరెక్ట్ కాదు. ఇండ్లు – కాంపౌండ్లు వేర్వేరు అయ్యాక అనుకరణ – పోలికలు అవసరం ఉండదు.
అసలు ఇండ్లకు పోలికలే సరిపడవు. ఎందుకంటే, ఎవరి ఇష్టాలు, ఎవరి అభిరుచులు వారికి ఉంటాయి. దక్షిణం రోడ్డు ఉన్న మీరు అన్నదమ్ములు స్థలాలు పంచుకొని ఇండ్లు కట్టుకుంటున్నారు. మీరు కాపౌండును మీ హద్దు మీద కట్టండి. రోడ్డులోకి జరగకుండా అలాగే, ఆ కాంపౌండు నుంచి నాలుగు అడుగులు దక్షిణం ఖాళీ ఉండేలా ప్రదక్షిణ స్థలాన్ని ఇంటికి వదిలి శాస్త్రబద్ధంగా మీ ఇల్లు మీరు తెలుసుకొని కట్టండి. ఎవరి ఇంటిని బట్టి వారి ఫలితాలు ఉంటాయని మరువకూడదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com ,Cell: 98492 78143