– కోణాల రామరాజు, జోగులాంబ
మీరు కొనే ప్రాంతంలో ఆ ఇండ్లను నిర్మించే సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఎలివేషన్ అది. మీరు కట్టిన ఇంటిని కొంటున్నారంటేనే మీ ఇంటి నిర్మాణం వారి చేతికి అప్పగించడం కదా. అందులో మనకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి,మరికొన్ని నచ్చనివి కూడా ఉంటాయి. ఎలివేషన్ అనేది ప్రధానంగా ‘యూనిక్‌గా’ ఉండాలని ఏర్పాటు చేసుకుంటారు. అందులో ఎవరి ప్రత్యేకత వారిది.
మీరు అన్నట్లు అన్నీ వాస్తుకు అనుకూలంగా ఉండవు. పూర్తిగా ఈశాన్యం తెంపు చేసి లేదా నైరుతి గదికి బాల్కనీలు పెంచి ఇలా ఎన్నో వికృత ఎలివేషన్లు మనకు కనిపిస్తుంటాయి. అలాంటివి మాత్రం జాగ్రత్తగా గుర్తించి వాటిని మార్పు చేర్పులు చేశాకే ఇల్లు కొనటానికి నిర్ణయం తీసుకోవాలి. నచ్చడం వేరు, శాస్త్రం ఒప్పుకోవడం వేరు. కాబట్టి ఇల్లు కొనేముందు అన్నీ చూసుకొనే ముందుకు వెళ్లాలి లేదంటే మానుకోవాలి.
– సురభి వెంకటేశ్, సికింద్రాబాద్
మన శరీరంలో కళ్లు, ముక్కు, చెవులు, తదితర జ్ఞానేంద్రియాలు తలలో ఉండగా బొడ్డు నుంచి పైకి స్వీకరణ ద్వారాలు, కిందికి విసర్జక అవయవాలను కలిగున్నాం కదా. అలాగే ఉచ్ఛమైన దిశల్లోనే పూజా విగ్రహాలు, పూజ గది నిర్మితం కావాలి. అదే విధంగా తూర్పు మధ్యలో లేదా ఈశాన్యం గదిలో తూర్పు ద్వారం పెట్టండి.

ఉత్తర స్థానంలో పూజగదిని నిర్మించాలి. ఇంట్లోకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అనే ఆలోచనతో పూజాస్థానం నిర్ణయించకూడదు. గృహ నిర్మాణానికి నిర్దుష్టమైన శాస్త్రీయ విద్యను ఆపాదించారు. అది మన కల్పనతో ముడిపెట్టేది కాదు.
– అత్తలూరు జయలక్ష్మి, మారేడుపల్లి
మన ఇంట్లో ఎంతో కాలంగా మనవెంటే ఉంటున్న గంగాళం, గ్లాసులు, దేవుని విగ్రహాలు ఎలాగైతే వాడుతున్నమో బీరువాలు కూడా నాణ్యతగా ఉంటే వాటిని వాడుకోవడంలో తప్పులేదు. ఈ మధ్య చాలా మంది ట్రెండింగ్ పేరుతో గదుల్లో ఖరీదైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే ఈ పాత బీరువాలు ఉంటే మంచిది కాదని, వాస్తు దోషమని సాకులు చెబుతూ వాటిని ప్లానింగ్ ప్రకారం బయట పడేసేందుకు ఇంట్లో వాళ్లను ఒప్పిస్తున్నారు. అలాచేయకుండా మనం వాడుతున్న పొయ్యి, గిన్నెలు, మంచాలు ఎన్నో ఏళ్లుగా వాడుతున్నట్లే అల్మారాలు కూడా పెట్టుకునే విధంగా కొత్త ఫర్నిచర్‌ను సిద్ధం చేసుకుంటే మన జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్నవాళ్లమవుతాం.
– కె.మల్లేశ్వర్, మేడ్చల్
ఉన్న ఇల్లు చిన్నదైనప్పుడు అవసరం కోసం ఇల్లు పెంచుకోవాల్సి వస్తే నిరభ్యంతరంగా తూర్పునకు, ఉత్తరానికి పెంచుకోవచ్చు. ఇదేం దోషం కాదు. దక్షిణం వైపు పెంచుకున్నప్పుడే దోషమవుతుంది. ఉత్తరంవైపు మీరు ఎంత కొలతతో ఇంటిని పెంచాలనుకుంటున్నారు.

ఖాళీ స్థలం ఎంత ఉందనేది ముందే సమీక్ష చేసుకోండి. దక్షిణం వైపు ఉన్న ఖాళీ కన్నా ఎక్కువ స్థలం ఉత్తరానికి వదిలి మిగిలిన భాగం చూసుకొని పెంచాలి. తూర్పు, పడమర వైపు ఎంత పొడవుందో చూసుకొని అంతే పొడవును పెంచుకోవాలి. పెంచే క్రమంలో ఈశాన్యం మాత్రం తగ్గించకూడదు. పాత ఇంటి ఉత్తరం అంచును రెండు ఫీట్ల వరకు చీల్చి దానికి మెర్జ్ చేసి గ్యాప్ లేకుండా కొత్త స్లాబ్ వేయాలి. శాస్త్రబద్ధంగా ఇంటిని కడుతూనే దాని భద్రతను, పటిష్ఠతను చూసుకోవాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143