-కె. సత్యం, సరూర్‌నగర్.
ఆ దిక్కుమాలిన వాదమే.. ఈరోజు అనేక గృహాలకు ఈశాన్యం లేకుండా చేస్తున్నది. కారు పార్కింగ్ అని, స్థలం కలిసివస్తుంది అని కొందరు ఇంటి ఈశాన్యాన్ని తెంపి.. ఈశాన్యం పెరుగుతుంది అని భ్రమింపజేస్తున్నారు. ఇళ్లనూ అలాగే నిర్మించి ఇస్తున్నారు. అవన్నీ మాయాగృహాలు.
ఆ తర్వాత కానీ దాని ఫలితం తెలియదు.. ఆ యజమానికి. ఇంటి నిర్మాణం వేరు. ఇల్లు కట్టిన స్థలం వేరు. ఇంటి ఈశాన్యం మూల తగ్గించి ఇంటిని మూడు మూలలతో నిర్మించి.. అది ఈశాన్యం పెంపు అనడం చాలా దోషపూరిత వాదన. ఇంటి చుట్టూ ఖాళీ ఆవరణలో ఈశాన్యం పెరిగి ఉండవచ్చు అనేది శాస్త్రవచనం. ఇంటి మూల కత్తిరించమని కాదు. జాగ్రత్తగా తెలుసుకొని ఇల్లు నిర్మించుకోవాలి.
-కె. అరుణ, ఖమ్మం.
ఎవరి దైవం వారికి పరమోత్కృష్టం. దానిని ఎందుకు పూజించకూడదు? ‘ఎంత పరిమితి విగ్రహంతో పూజించాలి?’ అనేది శాస్త్రపరంగా నిబద్ధత ఉంటుంది. కానీ, ఆ దైవాన్ని మాత్రం పెట్టవద్దు అనేదిలేదు. కల్పిత వాదన అది. భక్తిని అనుగ్రహించేది విగ్రహం. భగవంతుడు అంతటా ఉంటాడు అనేది నిజమని తెలిశాక.. ఒక్క శ్మశానానికి పరిమితం చేయడం దేనికి? అంతటా ఉండేవాడు ఈశ్వరుడు. నా ఇంటిలో ఒక లింగం ఆకారంలో ఉన్నాడు. అంటే ఒక ఆకారంలో నేను పెట్టి పూజించుకుంటున్నాను.. అది దోషంకాదు.ఏది శ్మశానం కాదు? పడక గదిలో తాత చనిపోవడం లేదా? ఇల్లు మరణానికి దూరంగా ఉంటుందా? ఎన్ని సూక్ష్మజీవులు మన గృహంలో మరణించడం లేదు? ఎన్ని క్రిమికీటకాలను మనం చంపడంలేదు? దోమలు, బొద్దింకలతో సహా..
అప్పుడు గృహం శ్మశానం కాదా? అలా చూస్తే.. సమస్త భూమి శ్మశానమే అనిపిస్తుంది. శివుడు శ్మశానంలో ఉన్నాడని భావించవద్దు. శ్మశానం కూడా శివుడిలోనే ఉంది. అదేకాదు, సమస్త విశ్వం ఆయనలోనే ఉంది అనే భావనతో.. ఒకరు శివుడిని, ఒకరు విష్ణువుని తమతమ గృహాలలో పూజిస్తారు. అది ఎప్పుడూ దోషంకాదు. ఎవరి ఆరాధన వారిది. భగవంతుడికి పరిధులు మనం పెట్టుకున్నవి. ఆయనకు పరిధి ఎందుకుంటుంది? ‘సర్వం శివమయం జగత్’ అని అందుకే అంటారు. శివుడు అనంతుడు. ఆయనను లింగాకారంలో పెట్టుకొని నిత్యం పద్ధతిగా అర్చన చేయడం మాత్రం మానవద్దు. అది ఒక యోగం. శివ లింగాన్ని వద్దు అనుకోవడం.. ఒక రోగం! అంతే! మీరు చక్కగా పూజగదిలో లింగాన్ని పెట్టుకొని పూజించుకోండి.
-వి. రాజు, కరీంనగర్.
మీరు ఆఫీస్ గదిని వేసుకోవచ్చు. అయితే, మీ ఇంటికి ఉత్తరభాగంలో మరో గది సుమారు పది అడుగులు వేసుకున్నా కూడా సరిపోయే స్థలం ఉండాలి. ఆ గదిని ఇంటికి ఆనుకొని వేసుకున్నప్పుడు ఉత్తరం – వాయవ్యంలో కేవలం ఒక్క గదిని మాత్రమే వేసుకోవద్దు.
ఇంటి తూర్పు, పడమర ఎంత పొడవు ఉంటుందో.. అంత పొడవుతో వేసుకోవాలి. దానిలో వాయవ్యంలో ఒక గదిని కట్టుకోవాలి. ఉత్తరం పెంచినప్పుడు మీ ఇంటికి ఉత్తరంలోకి కాంపౌండ్ గోడకు మధ్యన ఖాళీ భాగం దక్షిణం కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉత్తరంలో మీకు సింహద్వారం కూడా వస్తుంది. ఇంటి ఫ్లోరింగ్ లెవల్ చూసుకొని దానికన్నా ఎత్తు వెళ్లకుండా దానితో సమాన ఎత్తులో గానీ, డౌనుచేసి గానీ గదిని వేసుకోవచ్చు.
-కె. శ్రీనివాస్, పెంబర్తి.
కార్యాలు (పనులు) జరగాలి అంటే.. యజమాని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో శుభకార్యం అనేది జరగాలంటే.. సమయం, డబ్బు, సంకల్పం అనేవి కావాలి. ఇందులో ‘సంకల్పం’ అనేది బలమైన అంశం. మనసు నిర్ణయించుకోవడం అనేది అంత సులభంగా జరగదు. దానికి సానుకూలత కావాలి. ఇంటిలో నెగెటివ్ శక్తి ఉన్నప్పుడు మనసు స్థిమితంగా ఉండదు.
అయోమయం – ఆందోళనలే నిండిపోయి.. చేయాల్సిన పనులు పోస్ట్‌పోన్ అవుతుంటాయి. ఆరోగ్యం – ఐశ్వర్యం ఈ రెండూ శుభకార్యాల సంకల్పానికి ప్రధాన కేంద్రాలు అవుతాయి. అవి ప్రకృతి సహకారంతోనే వ్యక్తికి వస్తాయి. విరుద్ధమైన ఇంటిలో విరుద్ధ భావాలు.. అనారోగ్యాలు.. అనేక అవకతవకలు నడుస్తుంటే.. శుభకార్యాలు జరగవు. కేవలం డబ్బులు ఉన్నంతమాత్రాన పనులు ముందుకుసాగవు. సమయం కూడా అనుకూలించాలి. అన్నీ మనిషి చేతుల్లో ఉండవు. అలా ఉంటే.. శాస్ర్తాల అవసరమే ఉండదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143