– వి. శారద, బీరంగూడ.
స్థలం చిన్నదైనా.. పెద్దదైనా.. ఇంటి చుట్టూ ఖాళీ అనేది తప్పనిసరి. అలాగే, నాలుగు గదుల మందం పంపకంరాని ఇంటి స్థలాన్ని.. ఇంటికోసం ఉపయోగించవద్దు. ఇల్లు స్థలాన్ని బట్టికాదు. ఇంటికోసం స్థలం అవసరం. బట్టను బట్టి ఒంటికి షర్టులు కుట్టడం కాదు. ఒంటి కొలతను బట్టి బట్ట తీసుకొని, షర్టులు కుట్టించుకుంటాం కదా! ‘స్థలం చిన్నది. వరుసగా రెండు రూములు పడతాయి. చిన్న గొట్టంలాగా కట్టుకొని ఉంటాం. అది చాలుకదా!?’ అనుకోవద్దు. అలాంటి చిన్న స్థలాల్లో కట్టేకంటే.. కిరాయి ఇండ్లలో ఉండటం చాలా మంచిది. సొంత ఇల్లు అనేది గొప్ప అంశం కాదు.
మంచి శాస్త్రగృహం అనేది ముఖ్యం. కనీసం ఒక కిచెన్, పడక గది, చిన్న పూజగది, కూర్చోడానికి కాసింత హాలు.. ఇవి అత్యంత ప్రధానం. వైశాల్యం తక్కువైనా.. ఎక్కువైనా.. దానికో పద్ధతి ఉంటుంది. ఇక ఇంటి హద్దులమీద ఎటుదిక్కు కూడా కట్టవద్దు. కనీసం ఊపిరి పీల్చుకునే స్థలం.. రెండు రెండున్నర అడుగులైనా ఇంటిచుట్టూ వదలాలి. ఇల్లు ప్రాణవాయువును తీసుకోవాలి. వదలాలి. అప్పుడే ఆ ఇల్లు బతుకుతుంది. బతికిస్తుంది.
– ఎం. వెంకటేశ్, కొలనుపాక.
మనచుట్టూ బాగుంటేనే మనం బాగుంటాం. వీధిశూల స్థలంవల్ల.. ఆ స్థలంలో నిర్మాణం జరిగేవరకూ అది అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. మీరు మీ స్థలంలో వెంటనే ఇల్లు కట్టుకునే నిర్ణయం చేయకండి. ఆ పక్కస్థలం మనపేరు మీద లేకున్నా.. దోషం మనమీద పడుతుంది. మీ పక్క స్థలంలో ఏదోఒక నిర్మాణం రావాలి. అప్పుడే ఆ వీధిపోటు.. ఆ నిర్మాణం సొంతం అవుతుంది.
అంటే.. మనకు అడ్డుగా ఉంటుంది. కాబట్టి, మన మీద దాని ప్రభావం ఉండదు. ఒకవేళ పక్క స్థలంలో ఇల్లు కట్టి ఉంటే.. ఆ ఇంటికే వీధిశూల ఉంటే.. మనకు దోషంలేదు. మన స్థలంలో మన ఇల్లు కట్టుకోవచ్చు. పక్కస్థలం ఖాళీగా ఉంటేనే కష్టం. ఒక్కోసారి ఈ వీధిశూల స్థలంలో ఎవరూ ఇల్లు కట్టకపోవచ్చు. అప్పుడు మనంకూడా కట్టలేం. కాదు.. కూడదని వీధిపోటులోకి వెళ్లి ఇల్లు కట్టడం.. కట్టినా అది పూర్తవ్వడం.. అందులోనూ చక్కగా ఉండటం.. అన్నీ ఇబ్బందికరమైనవే!
– వి. జోగేందర్, ఆలేరు.
‘దక్షిణం గోడ పడిపోతేనే కట్టాలి. తూర్పు కాంపౌండ్ పడిపోతే కట్టాల్సిన అవసరం లేదు!’ అనేది లేదు. ఏ కాలుకు దెబ్బ తగిలినా.. వైద్యం చేసుకున్నట్టు.. ఏ వైపు కాంపౌండు కూలినా వెంటనే కట్టుకోవాలి. ముఖ్యంగా, కాంపౌండ్లు మధ్యలో కూలిపోతున్నాయంటే.. వాటికి తగిన విధంగా పునాదులు బలంగా లేకపోవడం లేదా పక్కనున్న స్థలం తవ్వడం లేదా నీళ్లు నిలవడం.. మొదలైన కారణాలు ఉంటాయి.
అలాంటి వాటిని ముందుగా పరిశీలించి, దానికి తగిన మార్పులు – మరమ్మతులు చేసి, తిరిగి పునాదిసహా.. కాంపౌండు మళ్లీ పడిపోకుండా వెంటనే కట్టుకోవాలి. ఆలస్యం మంచిదికాదు. అప్పుడే ఇల్లు తిరిగి పునరుజ్జీవితం పొందుతుంది.
– కె. వేణు, నిజాంపేట.
ఒక గదినుంచి మరో గదికి వెళ్లేటప్పుడు లేదా ఇంటికి ఉత్తరం – ఈశాన్యంలో ద్వారం పెట్టి.. దానికి సరిగ్గా ఎదురుగా ఉన్న గదికి అదే వరుసలో కాకుండా.. పక్కకు ద్వారం పెట్టినప్పుడు నడకల విధానం మారుతుంది. ఇంటికి వరుస ద్వారాలు అత్యంత ప్రధానం.
ఒంటికి, మనిషికి కూడా వరుస నడక ఉంటుంది. అలాగే, ఇంటికీ అవసరం. ఇలాంటి ద్వారాల నిర్ణయాన్ని ఇంటి ప్లానులో ముందుగానే జాగ్రత్తగా విభజన చేసుకొని కట్టాలి. ఇష్టం వచ్చినట్టుగా గదుల ద్వారాలను వేటికి అవిగా లెక్కించి పెట్టుకోవద్దు. మొత్తం గృహాన్ని లెక్కించి ఉచ్ఛమైన స్థానంలో నడకలు సాగేలా నిర్మించాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143