– ఆర్. సునీత, నిర్మల్.
ఇంటి ప్లాను సొంతంగా మార్చుకొని కట్టుకొనేటట్లు అయితే.. ఆ ప్లాను తీసుకోవడం ఎందుకు? మీరే ఇష్టం వచ్చిన ప్లాను వేసుకొని కట్టుకోవచ్చు కదా! ఎవరు వద్దంటారు. మీ ఇల్లు మీ ఇష్టం కదా! శాస్త్రం ప్రకారం కట్టాలి అనుకుంటే.. దానిని పూర్తిగా అనుసరించాలి. ఏదో తంతుకోసం ప్లాను తీసుకొని, అందులో ఎన్నో మార్పులు చేసి, కట్టేటప్పుడు ఎవరో చెబితే.. మళ్లీ మార్చి. కాదుకాదు.. అని ఈశాన్యం ఖాళీగా ఉండాలని.. డ్రాయింగ్ రూమును కారు పార్కింగ్ చేసి ఇల్లు కడితే.. దానికి ఔన్నత్యం ఉంటుందా? దాన్ని శాస్త్రగృహం అని అంటారా? ఆ గృహం శుభాలు కలిగిస్తుందా? ‘ఎంతశాతం వాస్తు ఉండాలి?’ అనేది ఏంటి? వందశాతం శాస్ర్తానికి ఉంటేనే.. చెడు కర్మ ఫలితాలు అణిగిమణిగి ఉంటాయి. ఇక మీరు ఆ ప్లానులో మార్పు చేస్తే.. అందులో వాస్తు ఎలా ఉంటుంది? మీరేకాదు.. చాలామంది యజమానులు తెలిసీతెలియక మార్పులు చేస్తూ పోతుంటారు.
పడమర ఖాళీ వదిలి.. అటు జాగ ఉందికదా అని మాస్టర్ బెడ్రూముకు అటాచ్డ్ బాత్రూమును పశ్చిమం స్థలంలోకి జరిపి కడుతారు. లిఫ్ట్‌ను తూర్పులో పెట్టి, దాని వెనక భాగం పూజగది చేస్తారు. వాళ్ల దృష్టిలో.. ఇది మంచిదే కదా! అనుకుంటారు. మంచి చెడ్డలు నిర్ణయించాల్సింది మనంకాదు.. శాస్త్రం! దాని పరిపూర్ణ ప్రయోగజనిత ఫలమే గృహం. అప్పుడు ఆ గృహమే సౌభాగ్య నిలయం అవుతుంది.
శాతాల మీద ఆధారపడి శాస్త్రం ఉండదు. అంత పెద్ద సీసా నిండా తేనె ఉన్నా, అందులో ఒక్క నీటిచుక్క పడితే చాలు.. తేనె మొత్తం పాడైపోతుంది. లేదంటే ఆ తేనె వేల సంవత్సరాలు అయినా చెడిపోదు. అలా.. శాస్త్ర స్వభావం కూడా అంతే! మన సొంత తెలివిని దేంట్లోనూ వాడకూడదు. అది బెడిసి కొడుతుంది. ఇంటి ప్లాను ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతున్నదా? లేదా అనేది చూస్తూ ఇంటిని కట్టుకోండి. అదే మిమ్మల్ని గట్టుకు చేరుస్తుంది.
– వి. రాధ, రాజాపేట.
ఎక్కడో చూసి, ఏదో విని సొంత ప్రయోగాలు చేయకూడదు. ‘పిరమిడ్’ శక్తిమంతమైనదే! కానీ, ఆ పిరమిడ్లను చిన్నచిన్నవి కొని ఫాల్స్ సీలింగ్‌లో పరిచినంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదు. పిరమిడ్ కప్పుతో ఒక గదిని కట్టుకొని అందులో ఉంటేనే దాని ఉపయోగం ఉంటుంది. పిరమిడ్ అనేది పంచభూతాల శక్తికి ప్రతిరూపం. అది ఆకాశం కిందే కట్టాలి.
అంటే.. దాన్ని ఇండివిజ్యువల్గా కట్టి, ఆ గదిలో మెడిటేషన్ చేయడం లేదా టెర్రస్ మీద నైరుతి గదిని పిరమిడ్ వేసుకొని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కేవలం బొమ్మలవల్ల కాదు. పిరమిడ్ గదిలో ఉండటం వేరు. పిరమిడ్ నమూనాలు ఇంట్లో పెట్టుకోవడం వేరు. అరటిపండు తింటే బలం. దాని బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే కాదుకదా! ఏవైనా.. ఏదైనా శాస్త్రంతో భౌతికంగా ముడిపడినప్పుడే అవి ప్రయోజనాన్ని ఇస్తాయి. దేనినైనా తెలుసుకొని వాడాలి.
– పి. వెంకటేశ్, ఆలేరు.
ఒక్క రోడ్డుకన్నా రెండురోడ్లు ఎప్పుడూ గొప్పవే! అయితే, నైరుతి వైపు రోడ్లు.. అంటే దక్షిణం – పడమర రోడ్లు వచ్చినప్పుడు ఆ స్థలం పెద్దదిగా ఉండాలి. అలాగే, తూర్పు – ఉత్తరాలలో ఎక్కువ స్థలాన్ని ఖాళీగా వదిలి ఇల్లు కట్టాలి. ఈ రెండు వీధులలో ప్రధానమైన వీధి ఏదో చూసుకొని అందులో దక్షిణం పెద్దరోడ్డు అయితే.. ఆ దక్షిణమే సింహద్వారం పెట్టుకొని ఇల్లు కట్టాలి.
పడమర మెయిన్ రోడ్డు అయితే.. పడమర ప్రధాన ద్వారం వచ్చే పశ్చిమ గృహం కట్టాలి. ఈ స్థలం నైరుతి బ్లాకు అవుతుంది కాబట్టి, జాగ్రత్తగా అన్ని విధాలుగా తెలుసుకొని ఇల్లు నిర్మించాలి. చిన్న నైరుతి స్థలం కొనకూడదు. ఏమాత్రం దిశ వంకరగా ఉన్నా, పూర్తి విదిక్కులు అయినప్పుడు అది ఎంత గొప్ప స్థలమైనా.. ఈ నైరుతి బ్లాకులో నివాసగృహం నిర్మించవద్దు. అన్ని బ్లాకులు, అన్ని స్థలాలు బాగుంటాయి. కానీ, అన్నిటికీ ఒకే పద్ధతి ఉండదు. దేని విలువలు దానివే! వాటిని కోల్పోకుండా ఇల్లు కట్టాలి.
– బి. శ్రీనివాస్, వెల్దండ.
అవును. వస్తువు కన్నా.. వస్తువును వినియోగించడమే చాలా ముఖ్యం. వినియోగించడం రాని వ్యక్తి చేతిలో ఆ వస్తువుకు ప్రయోజనం సిద్ధించదు. ఇల్లు గొప్పగా శాస్ర్తానికి కట్టి, ఉన్నచోటే వండుకుందామని ‘నైరుతి గదిలో స్టవ్’ పెట్టి వాడుకుంటే.. అది విరుద్ధ ఫలితం ఇస్తుంది. ‘నా కొడుకు, కోడలు సంపాదిస్తున్నారు. మేం చేతగాని వాళ్లం!’ అని ‘నైరుతి పడక గదిని’ కొడుక్కు అప్పగించకూడదు.
రెండు డోర్లు ఉన్నాయి కదా.. మరొకటి అనవసరం అని తూర్పు ద్వారం లేదా ఉత్తర ద్వారం మూసిపెట్టి, ఇంటిని వాడుకోవద్దు. నైరుతిలో మెట్లకింద ఖాళీ జాగా వేస్టుగా ఉందనీ, అందులో లెట్రిన్ గదిని కడదామని ఆ మూలలో నిర్మాణం చేయకూడదు. ఇలా ఇల్లు కట్టడం, దాని వినియోగం తెలిసి చేయాలి. అప్పుడే మంచి జీవనం ఉంటుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143