– ఎస్. రామరాజు, కోరుట్ల
సొంతవైద్యంతో ఒళ్లు, సొంత తెలివితో ఇల్లు చెడగొట్టుకునేవాళ్లు చాలామంది ఉంటారు. లోకంలో ఇంటికి ఈశాన్యం పల్లంగా ఉండొచ్చు అనేది ఇంటి లోపల కాదు, ఇంటి బయట. దానిని మనవాళ్లు నేరుగా ఇంట్లోకే తెచ్చారు. శాస్త్రం అంత త్వరగా అర్థం కాదు. ఇంటికి సంబంధించిన నిర్మాణం చాలా తీక్షణంగా చూడకుండా ఎత్తు పల్లాలు చేసి కట్టవద్దు. నైరుతి గదిని రెండుఫీట్లు పెంచి, ఈశాన్యం కిందికి దించి లోతు చేసి కడితే.. ఇవన్నీ ఇంటి మధ్య కొలతలను మార్చివేస్తాయి. నిలువు కొలతల్లోనూ తేడాలు ఏర్పడతాయి. తద్వారా ఇంటి శక్తిలో అనేక బలహీనతలు సంతరించుకుంటాయి. కళ్లకు నచ్చింది కాదు, శాస్త్రం చెప్పిందే చేయాలి. మీరు ఫ్లోరింగ్ ఎత్తు పల్లాలు చేసి ఇల్లు కట్టకండి. రెగ్యులర్ ఫ్లోరింగ్‌తో పూర్తిచేస్తే చాలు ఆ ఇల్లు బాగుంటుంది.
– ధనుంజయ్, జీడికల్
సెల్లార్.. ఇది భూమిలోకి గొయ్యి తీయడం. పార్కింగ్ కోసం గొయ్యి తీసే వాడకం పెరిగిపోయింది. ఇది అవసరమని భావించినా.. తూర్పు-ఉత్తరం రోడ్డుకు పనికిరాదు. మీరు సెల్లారులోకి వెళ్లాలి అంటే రోడ్డు నుంచి ర్యాంపు వేసుకొని వెళ్లడానికి దక్షిణ-ఆగ్నేయం మంచిది.

అలాగే పడమరలో రోడ్డు ఉన్నట్లయితే.. పడమర-వాయవ్యం నుంచి సెల్లారులోనికి వెళ్లండి. ఈ రెండు ప్రధానం. తూర్పు-ఉత్తరాలను పల్లం చేస్తే ఉత్తమ ఫలితాలు అందిస్తాయి. రోడ్డు తూర్పున ఉండి, కమర్షియల్ బిల్డింగ్‌కి సెల్లారు తప్పని అనుకున్నప్పుడు.. దక్షిణం-పడమర డ్రైవింగ్ స్థలం వదిలి రోడ్లు ఎటు ఉన్నా పడమర-దక్షిణాల నుంచి సెల్లారుకు వెళ్లేలా ర్యాంపులు వేసుకోవాలి.
– గుర్రం లక్ష్మి, సైదాబాద్
మీరు వివరాలు బాగానే ఇచ్చారు. మీరు ఎంపిక చేసిన ఇంటికి తూర్పు-ఉత్తరాలు రెండు రోడ్లు ఉన్నాయి. కానీ, ఉత్తరం దిక్కున ఎత్తు, పడమర ఖాళీ స్థలం ఉండటం మంచిది కాదు. ఈశాన్యం బ్లాక్ ఇంటికి ఎప్పుడైనా దక్షిణ-పడమరలోనే ఇండ్లు ఉండాలి. చాలామంది ఇండ్లల్లో ఈశాన్యం గొప్పదని కొంటారు. సరైన బలం, బలగం లేకపోతే రాజు అనేవాడు ఎందుకూ పనికిరాడు.

శక్తియుక్తులు ఉన్నప్పుడే ఇంటికైనా, ఒంటికైనా రక్షణ ఉంటుంది. మీరు ఇల్లు ఏది కొన్నా చూపించుకొని కొనండి. అన్నీ బాగున్నా దిశలు బాగులేకపోతే వద్దు. మనకు తెలియని లోపాలు ఎన్నో ఉంటాయి. మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.
– కెప్టెన్ రాజీవ్, ధర్మపురి
కొట్టిపారేసిన వాళ్లంతా ఆ తరువాత కాలంలో చాలా కరెక్ట్‌గా ఆచరిస్తుంటారు. జీవితం ఎప్పుడు? ఎలా? మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అందరూ కాలానికి దాసులు, బద్ధులే కదా! కనిపించనిదే నడిపిస్తుంది అన్న జ్ఞానం తెలిసి వచ్చేసరికి బతుకు తెల్లారిపోతుంది. ఇది అంత ఈజీగా తలకెక్కదు. మనిషి చాలా లోతుగా భ్రమలో కూరుకుపోయి ఉంటాడు. అది అంత త్వరగా ఎవరినీ వదలదు.

మనిషి అన్నీ తను చేస్తుంటేనే జరుగుతున్నాయి అనుకుంటాడు. శరీరంలో కిడ్నీలు ఎవరు చెబితే ప్రతిక్షణం రక్తాన్ని శుభ్రం చేస్తున్నాయి? ఎవరు చెబితే గుండె కొట్టుకుంటున్నది. నెలనెలా వాటికి బిల్లు కడుతున్నామా? సృష్టిలో వ్యక్తి ఒక భాగం. ఆ సృష్టికర్త నియమాలతోనే శరీరం పనిచేస్తుంది. అలాగే అతడు అందించిన సూత్రాలతో ఇల్లు నిర్మిస్తే.. జీవిత విలువలు, ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇది నమ్మకం గురించిన విషయం కాదు. సత్యం మీద ఆధారపడి శాస్త్రం పనిచేస్తుంది.
–సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143