Youth Drown in River : నదీ పరివాహక ప్రాంతాలు, పర్యాటక స్థలాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ యువకుడు నదిలో కొట్టుకుపోయాడు. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన అతడు అందరూ చూస్తుండగానే గల్లంతయ్యాడు. నదిలో పడిన చెప్పును తీసుకోబోయి తమ కళ్ల ముందే స్నేహితుడు నది ప్రవాహంలో కొట్టుకుపోవడం చూసి మిగతా నలుగురు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఉన్న పరేవా కోహ్ స్థానికంగా చాలా ఫేమస్ పర్యాటక స్థలం. కొండలు, నది నీళ్లతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రదేశం. ఆదివారం సెలవురోజు కావడంతో ఆయుశ్(Ayush) తన ఐదుగురు స్నేహితులతో కలిసి ‘పరేవా కోహ్’ (Pareva Khoh)కు వెళ్లాడు. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్న క్రమంలో అతడి చెప్పు అనుకోకుండా పక్కనే ప్రవహిస్తన్న నదిలో పడిపోయింది. నీళ్లలో తేలుతున్న ఆ చెప్పును అతడు ఒక కర్ర సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ప్రవాహ ధాటికి చెప్పు కొంచెం ముందుకు వెళ్లగా.. ఆయుష్ కూడా రాళ్ల మీదుగా అక్కడికి చేరుకున్నాడు. స్నేహితులు వారిస్తున్న వినకుండా అతడు నీళ్లకు దగ్గరగా వెళ్లాడు.
मध्य प्रदेश के सिवनी में पिकनिक पर गया 20 साल का युवक नदी में बह गया। घटना का वीडियो भी सामने आया है, जिसमें आयुष नाम का युवक लकड़ी की मदद से नदी में गिरी चप्पल निकालने की कोशिश करता दिख रहा है। चप्पल बह न जाए, इसी जल्दबाज़ी में वह आगे बढ़ता गया और अचानक उसका पैर फिसल गया, जिससे… pic.twitter.com/rMjhje2pVS
— AajTak (@aajtak) July 20, 2025
అయితే.. అతికష్టమ్మీద చెప్పును కర్రతో అందుకుంటుండగా.. ఆయుశ్ పట్టుతప్పిపోయి నీళ్లలో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు రాళ్లను పట్టుకుని బయటకు వద్దామనుకున్నా కుదరలేదు. నదిలో అతడలా కొట్టుకుపోతుంటే ఏం చేయాలో తెలియక భోరున ఏడ్చారు స్నేహితులు. వెంటనే అక్కడి సిబ్బందికి ఈ విషయం తెలియజేయగా.. పోలీసులు పరుగున వచ్చి ఆయుష్ కోసం గాలిస్తున్నారు.
’20 ఏళ్ల ఆయుష్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి పరేవా కోహ్లోని పిక్నిక్ ప్రదేశానికి వెళ్లాడు. దురదృష్టవశాత్తూ నీళ్లలో పడిన కాలి చెప్పును కర్రతో బయటకు తీసే క్రమంలో అతడు నదిలో కొట్టుకుపోయాడు. ఈతగాళ్లను రంగంలోకి దింపి అతడి కోసం గాలిస్తున్నాం’ అని పోలీస్ అధికారి పూజా చౌస్కీ మీడియాకు తెలిపాడు.