తాండూర్ : రెండు రోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవాలను ( Urs celebrations ) ప్రశాంతంగా నిర్వహించుకునేలా కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని తాండూర్ ఎస్సై డీ కిరణ్ కుమార్( Kirankumar ) అన్నారు. ఆదివారం కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. జాతర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ బందోబస్తును ( Security ) ఏర్పాటు చేసిందన్నారు. ఏదైనా సమస్య వస్తే పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.
ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. తాండూర్ గ్రామంలోపలికి వచ్చేవారు భక్త మార్కండేయ గుడి మూల మలుపు అశోక్ నగర్ ప్రాంతం నుంచి , రేచిని రోడ్ రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ అండర్ బ్రిడ్జి సమీపంలో వద్ద రహదారి నుంచి, తాండూర్ శివాలయం రహదారి నుంచి వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారి సూచనలు పాటించాలని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.