Huzurzbad | హుజూరాబాద్ టౌన్, జూలై 20 : వానలు కురవాలని ప్రార్థిస్తూ హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పలనర్సింగాపూర్ గ్రామస్తులు ఆదివారం కప్పతల్లి ఆటలు ఆడారు.
రోకలికి కప్పను వస్త్రంలో ఉంచి గ్రామంలోని ఇంటిఇంటికి తిరుగుతూ కప్పతల్లి తడిసేలా బిందెలతో జలాభిషేకం చేసి వానలు తొందరగా పడాలని కోరుకున్నారు. ఇలా పూజలు చేయడం ద్వారా వానదేవుడు కరుణించి వానలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్తులు పేర్కొన్నారు.