రోడ్డును అడ్డగించిన ఏనుగు… అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ
చెన్నై: ఒక ఏనుగు రోడ్డును అడ్డగించింది. దీంతో నిలిచిన అంబులెన్స్‌లో ఒక మహిళ ప్రసవించింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతానికి చెందిన నిండు గర్భవతి అయిన 24 ఏండ్ల గిరిజన మహిళకు గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఆ ఘాట్ రోడ్డుపైకి ఒక ఏనుగు వచ్చింది. రోడ్డుకు అడ్డంగా అది ఉండటంతో అంబులెన్స్ నిలిచిపోయింది. అర గంట అయినప్పటికీ ఏనుగు అక్కడి నుంచి కదల లేదు.
మరోవైపు అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీకి పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. అందులోని వైద్య సిబ్బంది ఆమె ప్రసవానికి సహకరించారు. దీంతో పండంటి బాబుకు ఆ మహిళ జన్మనిచ్చింది. ఇది జరిగిన కొంత సేపటికి ఆ ఏనుగు అక్కడి నుంచి కదిలింది. రోడ్డును వదలి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో మహిళతోపాటు పసి బిడ్డను అంబులెన్స్‌లో స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

