Viral Video | భాగస్వాముల పట్ల కొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రత్యేక మార్గాలను ఎంచుకుంటారు. తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా ప్రపోజ్ చేస్తుంటారు. అలా ప్రేమలో ఉన్న ఓ యువతి చాలా గ్యాప్ తర్వాత తన ప్రియుడిని కలుసుకుంటుండటంతో పట్టరాని ఆనందంతో ఉంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అనుకుంది. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికి అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కెనడాలోని టొరంటోలో నివాసం ఉండే ఓ యువతి.. చాలా రోజులుగా తన బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకోలేదు. ఇద్దరూ వేరు వేరు దేశాల్లో ఉండటంతో ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప డైరెక్ట్‌గా కలుసుకుని కబుర్లు చెప్పుకుంది లేదు. ఈ క్రమంలో సుమారు ఐదేళ్ల తర్వాత ప్రియుడు (Meets Boyfriend After 5 Years) తన వద్దకు వస్తుండటంతో ఆ యువతి పట్టరాని ఆనందంతో ఉంది. ఈ క్రమంలోనే ప్రియుడికి ప్రత్యేకంగా స్వాగతం పలకాలనుకుంది. ఈ మేరకు విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. ముందుగా విమానాశ్రయంలో (Canadian Airport) దిగి బైటకు వచ్చిన యువతి ప్రియుడికి కొందరు అబ్బాయిలు గులాబీ పువ్వులతో స్వాగతం పలుకుతారు. దీంతో ఆ యువకుడు తన ప్రియ సఖి కోసం అటూఇటూ చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ యువతి షేర్షా చిత్రంలోని ‘రాతన్ లంబియాన్..’ పాటకు డ్యాన్స్ చేస్తూ అతడి ముందుకు వెళ్తుంది. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. అనంతరం యువతిని గట్టిగా కౌగలించుకుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Bengaluru Traffic | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఫెరారీ సూపర్ కార్లు.. VIDEO
Supreme Court | ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు