కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరి ఏరియాలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఫుల్బరిలోని నివాస ప్రాంతాల మధ్య కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని కొండచిలువను బంధించారు. కొండచిలువ పొడవు సరిగ్గా 10 అడుగులు ఉన్నదని, ఇది బర్మీస్ పైథాన్ అని అధికారులు చెప్పారు. బంధించిన కొండచిలువను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
West Bengal: Forest officials rescued a 10-feet long Burmese python from a residential area in Fulbari, Siliguri today pic.twitter.com/vXPdVTfGqE
— ANI (@ANI) November 21, 2021