శ్రీనగర్: శీతాకాలం ప్రారంభం కావడంతో హిమాలయ పర్వతాల సమీపంలోని రాష్ట్రాల్లో మంచు కురుస్తున్నది. వివిధ ప్రాంతాల్లో ఫ్రెష్‌గా కురుస్తున్న మంచును పర్యాటకులు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్ రీజియన్‌లో సైతం మంచు విపరీతంగా కురుస్తున్నది ( Snow fall in Gulmarg ). ఇవాళ గుల్మార్గ్లో కురిసన తాజా మంచును పర్యాటకులు తెగ ఎంజాయ్ చేశారు. ఆ దృశ్యాలను కింది వీడియోలో మీరూ వీక్షించవచ్చు.
#WATCH | Jammu and Kashmir: Tourists throng Gulmarg as the region receives fresh snowfall today pic.twitter.com/72g0JSP6O5
— ANI (@ANI) November 5, 2021