శ్రీనగర్: ఆ పట్టణమంతా మంచు గుప్పిట్లో కూరుకుపోయింది. గత రాత్రి నుంచి భారీగా మంచు కురవడంతో ( Fresh snowfall ) పరిసరాలన్నీ తెల్లటి దుప్పటి పరిచినట్లుగా మారాయి. కొండలు, కోనలలో ఉన్న ఈ పట్టణంలోని చెట్లపైన, వాహనాలపైన, నేలపైన దట్టంగా మంచు పేరుకుపోయింది. ఎటు చూసినా దూదిపింజాల్లా మంచే కనిపిస్తుండటంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ, చూడటానికి మాత్రం ఆ దృశ్యాలు బహుసుందరంగా ఉన్నాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ పట్టణంలో ఈ సుందర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ మంచు దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా ఒకసారి వీక్షించండి.