సింహం గాండ్రిపులు వినిపిస్తేనే మనం హడలిచచ్చిపోతాం. కానీ, ఈయన ఏకంగా సింహాలతోనే నవ్వుతూ సెల్పీ దిగుతున్నాడు. సింహాలతో వాకింగ్ చేస్తున్నాడు. మృగరాజులతో ఆటాడుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియో వైరల్ అవుతోంది. చూసినవారంతా వీడు మగాడ్రా బుజ్జీ అని అంటున్నారు.
ఈ వీడియోలో సింహాలతో సరదాగా కనిపిస్తున్న వ్యక్తి పేరు హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త. అతడి విలాసవంతమైన జీవనశైలిని, సింహాలపై తనకున్న ప్రేమను సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాడు. ఈ సారి వీడియోలో ఒక సింహం చెట్టుపైకి ఎక్కగా, మరో రెండు కింద ఉన్నాయి. వాటికి కొంతదూరంలోనే హుమైద్ సెల్ఫీ తీసుకున్నాడు.
హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్ దుబాయ్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. అతడు ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ENOC) సీఈవో. అతడికి అల్బుకైష్ జంగిల్ అనే ప్రైవేట్ జూ కూడా ఉంది. ఎడారి మధ్యలో ఉండే ఈ జూలో సింహాలు, పులులు, హైనాలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులున్నాయి. ఆ జంతువులతో హుమైద్ అప్పుడప్పుడు ఆడుకుంటాడు. వాటి వీడియోలను ఇన్‌స్టాలో పెడుతుంటాడు. తాజాగా సింహం చెట్టెక్కిన వీడియో 137కే లైక్స్‌తో దూసుకుపోతున్నది.