రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). మార్చి 25న రిలీజైన ఈ చిత్రం చూసేందుకు ఇద్దరు హీరోల అభిమానులు ఎగబడ్డారు. థియేటర్ల వద్ద సందడి నెలకొంది. మా హీరో సూపర్ అంటే మా హీరో సూపర్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు. అయితే, సినిమాలో రామ్చరణ్, ఎన్టీఆర్ మధ్య జరిగే ఫైట్ సీన్ చూసిన ఓ బాలుడు కన్నీటి పర్యంతమయ్యాడు. థియేటర్లోనే గట్టిగా ఏడ్చేశాడు.
ఓ బాలుడు థియేటర్లో తన ఫ్యామిలీతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నాడు. ఓ సీన్లో ఎన్టీఆర్.. రామ్చరణ్ కొడుతుంటాడు. అంతే ఆ బాలుడు బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఏమీ అనకున్నా తన హీరోని కొడుతున్నారంటూ గోలగోల చేశాడు. రామ్చరణ్ను ఈ సినిమాలో విలన్ను చేశారంటూ విలపించాడు. ఈ సీన్ చూసి మొదట ఆశ్చర్యపోయిన ఆ బాలుడి ఫ్యామిలీ, తర్వాత గట్టిగా నవ్వుకున్నారు. వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారులే.. ఏడ్వకు అంటూ బాలుడిని బుజ్జగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా నవ్వుకుంటున్నారు.