పాములు అత్యంత ప్రమాదకరమైన, భయానక జీవులు. సైజుతో సంబంధం లేకుండా అన్ని జంతువులపై అవి దాడికి దిగుతాయి. కాగా, పొలంలో ఆవుదూడపై భారీ కొండచిలువ దాడిచేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆవుదూడను భారీ కొండచిలువ మింగేందుకు ప్రయత్నించింది.
ఈ వీడియోలో దాదాపు 10 అడుగుల పొడవున్న కొండచిలువ మొదట ఆవులున్న ఆవరణలోకి ప్రవేశించింది. దీంతో ఆవుదూడలు పరుగెత్తడం ప్రారంభించాయి. అయితే, కొండచిలువ ఓ ఆవుదూడ కాలును పట్టేసుకున్నది. దూడ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, కొండచిలువ దాని కాలిని గట్టిగా పట్టుకుంది. కొండచిలువ పట్టు చాలా బలంగా ఉండడంతో దూడ విడిపించుకోలేకపోయింది. దూడ తప్పించుకోగలిగిందా? లేదా? అనేది తెలియలేదు. ఆవుదూడను కాపాడకుండా యజమాని వీడియో ఎందుకు తీశాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను వైల్డ్‌లైఫ్ యానిమాల్ అనే యూజర్ ఇన్‌స్టాలో అప్లోడ్ చేశారు.