Viral video: ఈ మధ్య ఇంటర్నెట్లో వైరల్ వీడియోల హవా పెరిగిపోయింది. కుప్పలు తెప్పలుగా వింతలు, విచిత్రాలతో కూడిన వీడియోలు దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో కొత్త వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన యువతిని ఆ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తుంటారు. సగం ఇంటర్వ్యూ పూర్తవుతుంది. సరిగ్గా అప్పుడే ఆ యువతి అక్క ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి దూసుకొస్తుంది. ఇంటర్వ్యూ చేస్తున్న కంపెనీ ప్రతినిధుల ముందే తన చెల్లిని కుర్చీలోంచి లాగి కింద పడేస్తుంది.
అంతటితో ఆగకుండా ఆమె మీద కూర్చుని ఎడాపెడా వాయిస్తుంది. చెల్లెలు రెండు చేతులతో ముఖం దాచుకుంటున్నా అక్క మాత్రం ముఖాన్నే టార్గెట్ చేసి పిడి గుద్దులు గుద్దుతుంది. ఆ సమయంలో యువతి ఆగ్రహాన్ని చూసి ఇంటర్వ్యూ చేస్తున్న కంపెనీ ప్రతినిధులుగానీ, ఇతర సిబ్బందిగానీ ఆపే సాహసం చేయలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఈ ఘటనను తన ఫోన్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చెల్లిపై అక్క ఎందుకు దాడి చేసిందో కూడా ఆ పోస్టులో వివరించాడు. చెల్లి తన భర్తతో సంబంధం పెట్టుకుందని తెలుసుకుని, ఇంటర్వ్యూ జరుగుతున్న ఆఫీస్కు వచ్చి మరీ దాడి చేసిందని వెల్లడించాడు.
దాంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తున్నది. కొందరు నెటిజన్లు అయితే ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి
Wife Crashes Her Sister’s Job Interview After Finding Out She Slept With Her Husband pic.twitter.com/2SzzFPu3kS
— Dallas (@59dallas) September 11, 2021