సోషల్‌మీడియా పుణ్యమాని లోకల్ ట్యాలెంట్స్ బయటపడుతున్నాయి. గతేడాది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పదేళ్ల బాలుడు సహ్‌దేవ్ డిర్బో స్కూల్లో ‘బచ్పన్ కా ప్యార్’ పాటపాడి ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యాడు. బాద్షాతో కవర్‌సాంగ్ కూడా రికార్డ్ చేశాడు. ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి ఓ బాలిక హిందీ పాట అద్భుతంగా పాడి నెటిజన్ల మనసు దోచేసుకుంటున్నది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక మురి మురామి తాను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో ‘కహీ ప్యార్ న హో జాయే’ పాట పాడి ఆకట్టుకున్నది. సల్మాన్‌ఖాన్, రాణీ ముఖర్జీ నటించిన చిత్రంలోని ఈ పాటను అల్కా యాగ్నిక్, కుమార్ సను పాడారు. ఈ పాటను దంతెవాడ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మురి అచ్చుగుద్దినట్లు పాడింది. ఈ వీడియోను అవనిష్ శరణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్లో షేర్చేయగా, వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 125కే వ్యూస్ వచ్చాయి. 7,300 మంది లైక్ చేశారు. నెటిజన్లందరూ మురిని జూనియర్ లతా మంగేష్కర్ అని పిలుస్తున్నారు.
What a lovely voice.❤️pic.twitter.com/MwcWeG15Ac
— Awanish Sharan (@AwanishSharan) April 2, 2022