ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ చైనాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ షిప్‌ను త్రీ గోర్జెస్ కార్పొరేషన్, హుబే త్రీ గోర్జెస్ టూరిజం గ్రూప్ అనుబంధ సంస్థ అయిన చైనా యాంగ్జీ పవర్ కంపెనీ అభివృద్ధి చేసింది. చైనా మెరైన్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను ప్రోత్సహించేందుకు, విస్తరించేందుకు ఈ నౌకను ఉపయోగించాలనేది కంపెనీ ప్రణాళిక.

చైనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. యాంగ్జీ రివర్ హుబేలోని యిచాంగ్లో తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. చైనాలో అభివృద్ధి చేసిన ఈ నౌకలో 1300 మంది ప్రయాణించొచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కి.మీ ప్రయాణిస్తుంది.

యిచాంగ్లోని ఓడరేవులోకి వెళ్లే ముందు ఓడ యాంగ్జీ నదిలో ట్రయల్స్ వేసింది. జనవరిలో షిప్‌పై అనేక ట్రయల్స్ నిర్వహించారు.

‘జీరో ఎమిషన్స్’ సాధించిన ఈ షిల్లో7,500-కిలోవాట్ అవర్ భారీ మెరైన్ బ్యాటరీ ఉంటుంది. ఈ షిప్ ఏప్రిల్‌లో వాణిజ్య కార్యకలాపాల్లోకి రానుంది. దీనిని యిచాంగ్లో సందర్శనా యాత్రలకు ఉపయోగించనున్నారు.
ఈ ఎలక్ట్రిక్ క్రూయిజ్ 100 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది ఒక్కసారి 100 కి.మీ ప్రయాణించి దాదాపు 530 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని ఆదా చేస్తుంది. 23.5 మిలియన్ల డాలర్ల భారీ వ్యయంతో ఈ షిప్‌ను నిర్మించారు. ఇందులో ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి.