రష్యా-ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైంది. అప్పటినుంచీ ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది శరణార్థులుగా వేరే దేశాలకు వెళ్లిపోయారు. యుద్ధంతో ఆగమైపోతున్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ముందుకు వచ్చారు. తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఇందులోభాగంగానే అమెరికాలోని అట్లాంటాలో ఉన్న గుజరాత్ ఎన్నారైలు గుజరాత్ సింగర్ గీతాబెన్ రబారితో సంగీత కచేరీ నిర్వహించారు. పాటలకు ముగ్ధులైన ఎన్నారైలు ఆమెపై డాలర్ల వర్షం కురిపించారు.
‘లోక్డేరో’ పేరుతో ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ‘సూరత్ లీవా పటేల్ సమాజ్’ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు. గీతాబెన్ రబారీ పాటకు అంతా ఫిదా అయిపోయారు. ఆమెపై డాలర్లు విసురుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం మూడు లక్షల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 2.25కోట్లు వచ్చాయి. తనపై డాలర్ల వర్షం కురుస్తున్న ఫొటోలను గీతాబెన్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
26 ఏళ్ల గీతాబెన్ పాపులర్ గుజరాతీ సింగర్. ఆమె పాపులర్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. అలాగే, గుజరాత్‌తోపాటు విదేశాల్లో లైవ్ ప్రోగ్రాంలు కూడా చేసింది. ఫిబ్రవరి 2020లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోగల నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలోకూడా గీతాబెన్ ప్రదర్శన ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీనుంచి ప్రశంసలు పొందింది.