Viral Video | సమాజాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర చాలా కీలకమన్నది జగమెరిగిన సత్యం. వారి ప్రతిభతో ఎన్నో అద్భుతాలను సృష్టించగలరు. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు జరిగింది. ఓ ఇంజినీరు తనకు అవసరమైన పరికరాన్ని స్వతహాగా తయారు చేసి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.
అమెరికాకు చెందిన 33 ఏళ్ల బ్రియాన్ స్టాన్లీ అనే ఇంజినీరు క్యాన్సర్ కారణంగా తన ఎడమ కంటిని కోల్పోయాడు. దీంతో తన సొంత కృషితో కృత్రిమ కంటిని సృష్టించాడు. ప్రొస్తెటిక్ ఐబాల్ను ఫ్లాష్లైట్గా మార్చి తన కంటికి అమర్చుకున్నాడు. దీనిని టైటానియమ్ సైబర్గ్ అని కూడా పిలుస్తారట. ఇది చీకట్లో కూడా బ్యాటరీ వలె పనిచేస్తుండటం విశేషం. ఈ ఫ్లాష్ లైట్ బ్యాటరీ దాదాపు 20 గంటల వరకు ఉంటుందని బ్రియాన్ చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్రియాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం బ్రియాన్ ప్రతిభను మీరు చూసేయండి.