యూఎస్‌లోని కాన్సాస్ రాష్ట్రంలో టోర్నడో విధ్వంసం సృష్టించింది. ఆండోవర్ పట్టణాన్ని ఏప్రిల్ 29న భయానక టోర్నడో కుదిపేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో విధ్వంసం సృష్టిస్తున్న టోర్నడోను కెమెరాలో బంధించారు.
ఏప్రిల్ 29న ఆండోవర్ పట్టణంలో ఈఎఫ్-3 రేటెడ్ టోర్నడో విధ్వంసాన్ని ప్రజలు తమ కెమెరాల్లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఓ వ్యక్తి తీసిన వీడియోలో చాలా దూరం నుంచి టోర్నడో తన ఇంటివైపు వేగంగా దూసుకొస్తుంది. అతడి ఇంటి ఆవరణలోని కట్టడాలను నేలమట్టం చేసింది. ఈ భయానక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా, ఈ టోర్నడో ధాటికి దాదాపు వెయ్యి ఇండ్లు ధ్వంసమైనట్లు అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ నిర్వహించిన ప్రాథమిక సర్వేలో వెల్లడైంది.