‘పెద్ది’తో 400కోట్ల విజయాన్ని అందుకున్న రామ్చరణ్ తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించనున్న విషయం తెలిసిందే. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత సుకుమార్ నుంచి రానున్న సినిమా కావడం, ‘రంగస్థలం’ తర్వాత రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం.. ఈ రెండు కారణాల వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు చెందిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని దసరా రోజున ఘనంగా నిర్వహించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అర్బన్ బ్యాక్డ్రాప్లో నడిచే వైవిధ్యమైన కథతో రూపొందనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు స్థానం ఉన్నది. ప్రస్తుతమైతే రష్మిక మందన్న, జాన్వీకపూర్, అషికా రంగనాథ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.