Young Arjuna | మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు. సోషల్ మీడియాలో అడపాదడపా ప్రతిభావంతులు మనకు తారసపడుతుంటారు. అర్జునుడితో పోల్చదగిన బాలుడి విలువిద్య వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కొన్నాళ్ల క్రితం ఓ యువతి కాలితో విల్లు పట్టుకుని మరో కాలితో బాణం సంధించి ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని చేరుకున్నది. అది కూడా ఓ చెక్క బల్లపై నిలబడి శరీరాన్ని వెనక్కి వంచి మరీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ వీడియోను చూసిన వారంతా వావ్! విలువిద్యలో ఘనాపాఠి అని పొగిడారు. అచ్చం అలాంటి విలువిద్యనే మన బుడ్డోడు ప్రదర్శించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పల్లవి ప్రియ అనే మహిళ తన ట్విట్టర్ వేదిక నుంచి ‘అర్జున్ ఈజ్ స్టిల్ దేర్..’ అని పేర్కొంటూ ఓ అబ్బాయి వీడియోను పోస్ట్ చేసింది. కెనడా యువతి మాదిరిగా యోగా మ్యాట్‌పై నిలబడి శరీరాన్ని రివర్స్ గేర్‌లో వెనక్కి వంచి జిమ్నాస్టిక్ మాదిరి పోజులో ఒక కాలుతో విల్లును పట్టుకుని, మరో కాలుతో బాణం సంధించి లక్ష్యం చేరుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి విలువిద్యను ప్రదర్శించిన ఈ అబ్బాయిని చూసిన వారంతా మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు.
Arjun is still there….#Sujeeth #FireStormIsComing
Idli #HindenbergResearch DEPTH #Adaniscam Poha #30January Patriotism #TeJran pic.twitter.com/HKhCFQCHYl— Pallavi Priya (@P24Pallavi) January 30, 2023
వారం రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 27 వేల మంది వీక్షించారు. 20 రీట్వీట్లు కూడా నమోదయ్యాయి. ఈ అబ్బాయి తనలోని రెండు ప్రత్యేక లక్షణాలను బయటపెట్టాడు. ఒకటి జిమ్నాస్ట్ కాగా, రెండోది విలువిద్య. ప్రతీ ఒక్కరూ ఈ అబ్బాయిని సపోర్ట్ చేయాలని నెటిజెన్లు స్పందించారు. ఇలాంటి వారిని ప్రత్యేకంగా తర్ఫీదునివ్వడం ద్వారా మంచి విలుకాడిని తయారు చేయవచ్చునని మరికొందరు సూచించారు.