దొంగతనం అనేది ఒక ఆర్ట్. అది అందరికీ చేతగాదు. దొంగతనం చేయాలంటే ఎంతో తెలివి ఉండాలి. చాలా చురుకుగా ఉండాలి. అన్నింటినీ అంచనా వేసుకోవాలి. ఎలా పడితే అలా దొంగతనం చేస్తే అడ్డంగా పోలీసులకు దొరికిపోతారు. అప్పుడు చిప్పకూడే గతి. తొందరపడి.. అడ్డదిడ్డంగా దొంగతనాలు చేసి.. పోలీసులకు పట్టుబడిన దొంగలు కోకొల్లలు. అందుకే.. దొంగతనానికి చాలా కసరత్తు చేస్తారు కొందరు దొంగలు.
ఇక.. అసలు విషయానికి వస్తే.. ఒక దొంగ ఆవేశపడి ఏటీఎంలోకి దూరాడు. ఏటీఎం మిషన్‌లో ఉన్న డబ్బును దోచుకోవడానికి తెగ ట్రై చేశాడు. చివరకు ఏటీఎం మిషన్‌లోనే వెనక నుంచి ఇరుక్కుపోయాడు. అటూ ఇటూ ఏటూ కదలలేక అలాగే మిషన్ లో ఇరుక్కుపోయి ఉన్నాడు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో.. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి.. ఆ దొంగను ఏటీఎం మిషన్‌లోని చూసి బయటికి తీసి.. అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటన తమిళనాడులోని మోహనూర్ అనే ఏరియాలో చోటు చేసుకుంది. మోహనూర్కు సమీపంలోని అనియాపురంలో ఉన్న ఓ ఏటీఎం సెంటర్లో ఆ దొంగ దూరాడు. అర్ధరాత్రి పూట ఏటీఎం సెంటర్ నుంచి శబ్దాలు వినిపించడంతో అక్కడి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు… బారల్లి అనే ప్రాంతంలో కోళ్ల ఫామ్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతడి స్వస్థలం బీహార్ అని పోలీసులు వెల్లడించారు.