అమెరికా మాజీ అధ్యక్షుడు కన్స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడా? ఆశ్చర్యంగా ఉందే..!! ఈ వీడియో చూసినవారందరూ ఇలానే నోరెళ్లబెట్టారు. అయితే, అతడు నిజంగా డొనాల్డ్ ట్రంప్ కాదు.. అతడిలా ఉన్న మరో వ్యక్తి..అయితే, ప్రపంచంలో ఎంతోమంది ట్రంప్‌ను ఇమిటేట్ చేసేవాళ్లున్నా ఇతనంత పర్ఫెక్ట్గా ఎవరూ అనుకరించలేదు. అందుకే సడెన్‌గా చూసినవాళ్లంతా ట్రంప్ ఈ పనిచేయడమేంటని ఆశ్చర్యపోతున్నారట.
ట్రంప్‌ను అచ్చంగా అనుకరించే ఈ వ్యక్తిది న్యూయార్క్. ఇతడికి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఇతడు ట్రంప్‌ను పోలి ఉండడమేకాదు ట్రంప్‌లా హావభావాలు కూడా పలికిస్తాడు. ఇతడి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.