చెన్నై : మహిళలు పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది లేదంటూ ఇప్పటికే పలు ఉదంతాలు వెల్లడించాయి. సాహస మహిళల విన్యాసాలు వెలుగుచూసి అందరినీ ఔరా అనిపించిన సందర్భాలూ అనేకం. తమిళనాడులో ఓ మహిళ హైవేపై ట్రక్‌ను నడిపిన వీడియో సోషల్ మీడియలో తెగ వైరలవుతోంది.
ट्रक को इससे क्या मतलब कि चलाने वाला ‘पुरुष’ है या ‘महिला.’ ❤️ pic.twitter.com/g9IEAocv7p
— Awanish Sharan (@AwanishSharan) July 17, 2022
ఆమె ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐపీఎస్ అధికారి అవనిష్ శరణ్ షేర్ చేసిన ఈ వీడియోలో తమిళనాడుకు చెందిన నెంబర్ ప్లేట్‌తో కూడిన ట్రక్‌ను హైవేపై ఓ మహిళ వేగంగా నడుపుతున్న దృశ్యాలు కనిపించాయి. వీడియో తీస్తుండగా మహిళా డ్రైవర్ చిరునవ్వులు చిందించడం వీడియోలో కనిపించింది.
డ్రైవర్ మహిళా, పురుషుడా అనేది ట్రక్ పట్టించుకోదని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2.24 లక్షల వ్యూస్ రాగా, పెద్దసంఖ్యలో మహిళ సాహసాన్ని కొనియాడుతూ రియాక్షన్స్ వచ్చాయి. ఆమె ఎంతటి విశ్వాసం కలిగిఉందనేది ఆమె నవ్వు వెల్లడిస్తోందని నెటిజన్లు మహిళను ప్రశంసించారు. మహిళా సాధికారతకు ఆమె నిలువెత్తు నిదర్శనమని పలువురు కామెంట్ చేశారు.