జూ లోని కోతుల ఎన్క్లోజర్ను ఒక మహిళ తన చేతితో పలుమార్లు కొట్టింది. దీంతో ఆగ్రహించిన కోతులు ఆమె జట్టుపట్టుకుని లాగాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక మహిళ జూను సందర్శించింది. స్పైడర్ కోతులున్న ఎన్‌క్లోజర్ వద్దకు చాలా దగ్గరగా వెళ్లింది. మొబైల్ ఫోన్లో వాటి ఫొటోలు తీసింది. మొబైల్లో ఆ ఫొటోలు చూస్తూ ఒక చేతితో ఆ ఎన్క్లోజర్ను పలుమార్లు కొట్టింది.
కాగా, ఆ అమ్మాయి చర్యకు ఒక స్పైడర్ కోతి ఆగ్రహించింది. వెంటనే ఆ మహిళ జుట్టు పట్టుకుంది. ఎన్‌క్లోజర్‌కు దగ్గరగా ఆమెను లాగేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ యువతి కేకలు వేసింది. గమనించిన ఒక వ్యక్తి కోతి బారి నుంచి ఆమెను కాపాడాడు. తొలుత చేతితో కోతిని తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే అది ఆ మహిళ జట్టును వదలలేదు. దీంతో అతడు తన టీ షర్టు విప్పి దానితో కోతిని తరిమాడు. దీంతో ఆ యువతి జట్టును కోతి వదిలేసింది.
మరోవైపు ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లే క్రమంలో మరోసారి ఆ ఎన్‌క్లోజర్‌కు దగ్గరగా వెళ్లింది. ఈసారి రెండు కోతులు ఆమె జుట్టు పట్టుకుని లాగాయి. అయితే ఆ అమ్మాయి వెంటనే స్పందించి వాటి బారి నుంచి తప్పించుకుంది. కాగా, అక్కడ ఉన్న ఒకరు తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్‌క్లోజర్‌కు దగ్గరగా ఆమె వెళ్లడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది తెలియలేదు.