Indian Recipes in Japan | జపాన్‌లో భారతీయుల నోరూరిస్తున్న రెస్టారెంట్.. ఫిదా అయ్యానంటున్న ఇండియన్
Indian Recipes in Japan : భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుగంధద్రవ్యాల మేళవింపుతో యమా రుచిగా ఉండే మన దేశ రెసిపీలను విదేశీయులు సైతం లొట్టలేసుకుంటూ తింటారు. అందుకనే పలు దేశాల్లో భారతీయ రుచిల్ని వండివార్చే రెస్టార్టెంట్లు బోలెడు వెలిశాయి. ప్రస్తుతం జపాన్‌లోని క్యోటో(Kyoto)లో ఒక రెస్టారెంట్ యజమానులు...
Indian Recipes in Japan : భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుగంధద్రవ్యాల మేళవింపుతో యమా రుచిగా ఉండే మన దేశ రెసిపీలను విదేశీయులు సైతం లొట్టలేసుకుంటూ తింటారు. అందుకనే పలు దేశాల్లో భారతీయ రుచిల్ని వండివార్చే రెస్టార్టెంట్లు బోలెడు వెలిశాయి. ప్రస్తుతం జపాన్‌లోని క్యోటో(Kyoto)లో ఒక రెస్టారెంట్ యజమానులు ఇండియన్ రెసిపీలతో భోజన ప్రియుల మనసుదోచేస్తున్నారు. ఈమధ్యే క్యోటోకు వెళ్లొచ్చిన ప్రసన్న కార్తిక్(గోవా ముఖ్యమంత్రి మాజీ సలహాదారు) అనేటాయన అక్కడ అన్నంతో పాటు రుచికరమైన పప్పు, సాంబారు, రసం ఆరంగించి వచ్చాడు. ఆయన తన అనభవాలను సోషల్‌మీడియా వేదికగా ఇలా పంచుకున్నాడు.
‘క్యోటోలో దక్షిణ భారతదేశ వంటకాలను అందిస్తున్న ‘తడ్కా'(Tadka) పేరుతో నడిచే రెస్టారెంట్‌కు వెళ్లాను. ఈ రెస్టారెంట్‌ను మొత్తం జపనీయులే నడిపిస్తున్నారు. వాళ్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి అక్కడి కొత్త వంటకాలను నేర్చుకొని వెళ్తుంటారు. జపాన్ వెళ్లాక ఆ కొత్త రెసిపీలను తమ మెనూలో పెడతారు.
I visited this kick-ass south Indian restaurant called Tadka in Kyoto, Japan. Tadka is owned and run by Japanese people. They visit Chennai once every 6 months, learn new dishes, practice it to perfection and add it to their menu. pic.twitter.com/rDmBn4JbIC
— Prasanna Karthik (@prasannakarthik) October 29, 2023
ఇక్కడి కుక్స్ నాణ్యత విషయంలో రాజీ పడరు. అవును.. తడ్కాలో నేను రుచి చూసిన దోశ, ఇడ్లీ అచ్చం చెన్నైలో చేసినట్టే అనిపించాయి’ అని ప్రసన్న తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. చాప్ స్టిక్స్‌తో గబాగబా భోజనం ముగించే జపాన్ లాంటి దేశంలో భారతీయ వంటకాల్ని అది కూడా చేతితో కడుపారా తినే అవకాశం దక్కడంతో ఎంతో ఖుషీ అయ్యానని ప్రసన్న చెప్పుకొచ్చాడు. అతడి పోస్ట్ చూసిన చాలామంది జపాన్‌లో భారతీయ వంటకాలా.. భలే భలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు భారతీయ రుచులకు ప్రపంచమే ఫిదా అవుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
Babar Azam: సోషల్ మీడియాలో లీక్ అయిన బాబర్-పీసీబీ సీవోవో వాట్సాప్ చాట్.. పాక్ క్రికెట్లో కొత్త వివాదం
Vijay Kanakamedala | రూటు మార్చిన ‘నాంది’ దర్శకుడు.. బెల్లంకొండతో పక్కా కమర్షియల్.!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

