లండన్ : టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన గ్లోబల్ ఈవెంట్ సిరీస్ అరౌండ్ ద వరల్డ్ విత్ రోజర్ ఫెదరర్లో (Viral Video) భాగంగా లండన్ సందర్శించాడు. లండన్‌లో డిషూం రెస్టారెంట్లో రోజర్ ఫెదరర్ పార్శీ-ఇండియన్ ఫుడ్‌ను ఆస్వాదించాడు. 1960 ప్రాంతంలో బాంబేలోని ఇరానీ కేఫ్‌లకు మోడ్రన్ లుక్ ఇచ్చేలా డిషూం రెస్టారెంట్ పేరొందింది. ఎన్నో సంస్కృతుల మేళవింపులా ఉండే ఈ రెస్టారెంట్ కస్టమర్లకు ఇంటి వాతావరణాన్ని తలపించేలా ఉంటుంది.
ఈ రెస్టారెంట్ సహ వ్యవస్ధాపకులు షమిల్, కవి ధక్రార్ రెస్టారెంట్ విజన్‌ను వివరిస్తూ కేవలం భారతీయులే కాకుండా లండన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమకిష్టమైన ఫుడ్‌ను ఆరగించేందుకు ఇక్కడకు వచ్చేలా తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. ఇక డిషూం కిచెన్‌లో బ్రెడ్ తయారీలో రోజర్ ఫెదరర్ పాలుపంచుకోవడంతో పాటు దేశీ ట్విస్ట్‌తో ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంజాయ్ చేశాడు.
సాసేజ్, బీన్స్, గ్రిల్డ్ టొమాటోలు, ఎగ్స్, బటర్డ్ పావ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేయడంతో పాటు ఓ కప్పు ఛాయ్‌ను ట్రై చేశాడు. డిషూంకు తన విజిట్‌ను ఫ్యాన్ పేజ్‌లో షేర్ చేశాడు. ఇక ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్టు రోజర్ ఫెదరర్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read More :
Tirumala | తిరుమలలో చిక్కిన మరో చిరుత.. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే!