Rahul Gandhi | కాంగ్రెస్ముఖ్య నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కొనసాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, రాహుల్ సోమవారం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ కొందరు యువతీ యువకులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ యువకుడు రాహుల్ స్కిన్ కేరింగ్ గురించి ప్రశ్నించాడు.
‘‘ఇన్ని కిలోమీటర్లు ఎండలో నడుస్తున్నారు.. స్కిన్‌కు టాన్ రాకుండా ఎలాంటి సన్‌స్క్రీన్ ఉపయోగిస్తారు?’’ అని ప్రశ్నించాడు. దీనికి రాహుల్ గాంధీ.. ‘నేను ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడను’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆ యువకుడు ‘సన్‌స్క్రీన్ వాడకపోయినా మీ ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తోంది’ అని సరదాగా అన్నారు. దీనికి రాహుల్ నవ్వుతూ… ‘ మా అమ్మ నాకు సన్‌స్క్రీన్ డబ్బా పంపింది. కానీ నేను వాడట్లేదు’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దీంతో అక్కడ కాసేపు నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mr @RahulGandhi :
I don’t use sunscreen…
मेरी माँ ने मेरे लिए Sunscreen भेजी है लेकिन मैं इस्तेमाल नही करता pic.twitter.com/VTNTWHLHiZ
— Supriya Bhardwaj (@Supriya23bh) October 17, 2022