Dargah Roof Collapsed : ఢిల్లీలోని హుమాయూన్ సమాధి (Humayun Tomb)కి సమీపంలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఒక దర్గాలోని పైకప్పు కూలింది. శుక్రవారం సాయంత్రం దర్గా షరీఫ్ పట్టే షా (Dargah Sharif Patte Shah)లోని ఒక గది రూఫ్ ఒక్కసారిగా కింద పడడంతో అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
పదహారో శతాబ్ధం నాటి హుమాయున్ సమాధికి సమీపంలో ఉన్న దర్గాలో శుక్రవారం ప్రార్థనల కోసం ఇమామ్ సహా కొందరు యువకులు జమ అయ్యారు. అయితే.. హఠాత్తుగా రూఫ్ కూలడంతో పలువురు గాయపడ్డారు. పైకప్పు కూలే సమయానికి అందులో దాదాపు 15 నుంచి 20 మంది ఉన్నట్టు సమాచారం. వీళ్లందరి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని అంటున్నారు. కానీ, పోలీసులు మాత్రం దర్గాలో ఎందరు ఉన్నారు? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
#WATCH | Delhi | Portion of the roof of a room at Dargah Sharif Patte Shah, located in the Nizamuddin area, collapses; Police and Fire Department personnel on the spot; Area cordoned off pic.twitter.com/dMAEcJrlQn
— ANI (@ANI) August 15, 2025