జకార్తా: జూలోని ఒరంగుటాన్ ఎన్క్లోజర్కు చాలా దగ్గరగా వచ్చిన సందర్శకుడిపై అది ఆగ్రహించింది. వెంటనే అతడి టీ షర్టును పట్టుకుంది. ఒక వ్యక్తి అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించగా, ఆ సందర్శకుడి కాలును గట్టిగా పట్టుకుంది. ఇండోనేషియాలోని కసంగ్ కులీమ్ జూలో ఈ సంఘటన జరిగింది. ఒక సందర్శకుడు ఒరంగుటాన్ ఉన్న బోను వద్దకు వెళ్లాడు. కాస్త దూరం నుంచి దానిని చూడాల్సి ఉంది. అయితే అతడు బారికేడ్ను దాటుకుని ఎన్క్లోజర్కు బాగా దగ్గరకు వెళ్లాడు. రెండు చేతులు ముందుకు చాచి దానిని రెచ్చగొట్టాడు.
ఆ ఒరంగుటాన్ కోపంతో అతడి చేతులను పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే దాని చేతికి అతడి టీ షర్టు చిక్కింది. దీంతో దానిని గట్టిగా పట్టుకుని అతడ్ని ముందుకు లాగేందుకు ప్రయత్నించింది. సందర్శకుడి టీ షర్టును అది ఎంతకీ విడిచిపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి సహాయం కోసం ముందుకు వచ్చాడు. ఒరంగుటాన్ చేతి నుంచి టీ షర్టును బలంగా లాగేందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి టీ షర్టును వీడిన ఒరంగుటాన్ అతడి కాలును రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. వారిద్దరూ ఎంత ప్రయత్నించినా అతడి కాలును అది విడిచిపెట్టలేదు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జూ నిర్వాహకులు ఈ సంఘటనపై స్పందించారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలా జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు జూలోని జంతువుల మానసిక పరిస్థితికి ఇది అద్దం పడుతున్నదని జంతు ప్రేమికులు మండిపడ్డారు. జంతువులను జూలో నిర్బంధించడం అన్యాయమంటూ గళమెత్తారు.
— san (@sundaykisseu) June 7, 2022